E-Paper

విప్లవ వీరుడి పాత్రలో జీవించిన కృష్ణ.. అల్లూరి జయంతి ప్రత్యేకం!

విప్లవ వీరుడి పాత్రలో జీవించిన కృష్ణ.. అల్లూరి జయంతి ప్రత్యేకం!
Advertisement

Alluri Legacy: అల్లూరి సీతారామరాజు …ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్.కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్ళని తనదైన గెరిల్లా వ్యూహాలతో వణికించిన ‘మన్యం వీరుడు’. 1897 జూలై 4న పుట్టిన అల్లూరి 1924 మే 7న చనిపోయేవరకు ఆదివాసీల హక్కులని సాధించడమే తన లక్ష్యంగా బతికాడు.అయితే చరిత్రలో పుస్తకాల్లో ఈ అమరవీరుడికి కాస్త ఆలస్యంగా గుర్తింపు లభించినప్పటికీ మన వెండి తెర మాత్రం అల్లూరి జీవితాన్ని, వీరత్వాన్ని గొప్పగా ఆవిష్కరించి ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నతస్థానంలో కూర్చోబెట్టింది.

1974 మే 1న విడుదలైన అల్లూరి

ఇక మన ప్రేక్షకులకి అల్లూరి సీతారామరాజు అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ.ఒక రకంగా అసలు అల్లూరి అంటే ఇలానే ఉంటాడా అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.నిజానికి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా కన్నా ముందే అంటే 1968లో వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అసాధ్యుడు’సినిమాలోని ఒక నాటకం సీన్ లో అల్లూరి గా కనిపించి మెప్పించాడు కృష్ణ.ఇక ఆ తర్వాత 1974 మే 1న విడుదలైన పూర్తి స్థాయి ‘అల్లూరి సీతారామరాజు సినిమా ఏ స్థాయిలో అలరించిందో చెప్పక్కర్లేదు. త్రిపురనేని మహారథి కథ అందించగా ‘అసాధ్యుడు’తీసిన వి.రామచంద్రరావు దర్శకత్వంలోనే కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నిర్మాతలుగా మొదలైంది ఈ సినిమా.అయితే మధ్యలోనే దర్శకుడు వి.రామచంద్రరావు చనిపోవడంతో మిగిలిన భాగాన్ని కృష్ణ సూపర్ విజన్ లోనే పూర్తి అయింది.ఇక యాక్షన్ సీన్స్ కి మాత్రంK. S. R. Das తన సహయాన్ని అందించారు.

డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.1 కోటి సాధించిన తొలి చిత్రం

Advertisement

ఇక తెలుగులో తొలి తెలుగు ఈస్ట్‌మన్ కలర్ సినిమాస్కోప్ ఇదే కావడం విశేషం. కెరీర్ లో వందో సినిమా చేస్తున్న కృష్ణ ఎలాగైనా స్పెషల్ గా చేయాలని విదేశాల నుంచి ప్రత్యేక కెమెరాలు, లెన్స్‌లు తెప్పించి మరీ ఈ సినిమాని తెరకెక్కించాడట.ఇక ఈ సినిమాకి వచ్చిన అవార్డులు, రివార్డులకి లెక్కే లేదు.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలోని “తెలుగు వీర లేవరా” పాటకు Sri Sri ఉత్తమ గేయరచయిత అవార్డు అందుకోవడం.ఇక ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ఆ ఏడు నంది అవార్డు ని కూడా అందుకుంది ఈ సినిమా.ఇక ఈ సినిమాలో ఆదినారాయణ సంగీతంలో వచ్చిన తెలుగు వీర లేవరా,విప్లవం మరణించదు,వస్తాడు నా రాజు పాటలు ఇప్పటికీ ఎవర గ్రీన్.ఇక తెలుగు సినిమా చరిత్రలో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.1 కోటి సాధించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం ఇక్కడ మరో విశేషం.

అల్లూరి గెటప్ వేసి మురిసిపోయిన  రామారావు

నిజానికి ఈ సినిమాని శోభన్ బాబుతో తీయాలని ప్లాన్ చేశాడు నిర్మాత డి.ఎల్. నారాయణ.పాటలు తక్కువ , దేశ భక్తి ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ కి ఏ మాత్రం ఎక్కుతుందో అని డ్రాప్ అయ్యారట.ఇక నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అల్లూరి పాత్రని వేయాలని,బాగా ఆశపడ్డారు.తన స్వంత బ్యానర్ ఎన్.ఏ.టి. పతాకంపై ‘జయసింహ’ సూపర్ హిట్ అవడం తో తర్వాతి సినిమా అల్లూరినే అని ఫిక్స్ అయిపోయి మేకప్ టెస్ట్ కూడా చేయించారట. కాని అప్పటికి రామారావుకి ఉన్న బిజీ వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.అయితే తన కోరికని మాత్రం 1980ల దాసరి తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ లో శ్రీశ్రీ రాసిన బుర్రకథ నాటకంలో అల్లూరి పాత్ర వేసి తీర్చుకున్నాడు.ఇక 1993లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’లో“పుణ్యభూమి నా దేశం’ అనే పాటలో మరో సారి అల్లూరి గెటప్ వేసి మురిసిపోయారు రామారావు.

గుర్తుకు వచ్చేది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే !

Advertisement

ఇక వారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ బాలయ్య ‘భారతంలో బాలచంద్రుడు’ లో‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బయోపిక్‌లోనూ అల్లూరి పాత్రల్లో తళుక్కుమనగా ‘ముగ్గురు కొడుకులు’ లో ఒక స్టేజ్ డ్రామా సీన్‌లో అల్లూరిగా ఏకపాత్రాభినయం చేసి తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు.ఇక బాలకృష్ణ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’లో హీరో పేరు రామరాజు కాగ , ఖలేజా లోనూ మహేష్ బాబు పేరు అల్లూరి సీతారామరాజు కావడం విశేషం.ఇక వీరి సంగతి ఇలా ఉంటె జక్కన్న తన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) క్లైమాక్స్ లో చరణ్ ని అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎంతటి ఇంటెన్స్ తో చూపించాడో మనం మర్చిపోలేము.

ఏది ఏమైనా ఎందరు చేసిన ఇప్పటికీ అల్లూరి సీతారామ రాజు అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే !

Related News

ఆ బ్రాండ్ పరువు తీసేసిన త్రిష…నెట్టింట వైరల్ పోస్ట్!

Upcoming Movies : టాలీవుడ్ లో సినిమాల సందడి.. ఏ మూవీ ఎప్పుడంటే..?

15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?

జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌కమ్ తెలిస్తే మైండ్ బ్లాకే!

లెనిన్ కోసం డ్రాగన్ .. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా ?

స్కూల్ డేస్ లవ్ ప్రపోజల్.. ‘రాఖీ’తో ట్విస్ట్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ బ్యూటీ!

జాన్ అబ్రహాం ఆకలికి హోటల్ ఓనర్ షాక్.. ఒక్క సిట్టింగ్‌లో అన్ని చపాతీలు తిన్నాడా?

Big Stories

×