Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సనాతన ధర్మం గురించి అలాగే తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం గురించి ఇటీవల హిందీ భాష(Hindi Language) గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పై ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులపై డైరెక్టర్ గీతాకృష్ణ (Geetha Krishna)ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు.
రాజ్యాంగం కల్పించిన హక్కు..
ఈ సందర్భంగా డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ మా ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడటానికి అర్హత లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక మతం గురించి మాట్లాడిన లేదా సనాతన ధర్మం గురించి మాట్లాడిన అది ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ప్రకాష్ రాజ్ తరుచూ పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోడీ గురించి మాట్లాడటానికి కారణం లేకపోలేదని, ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఉందని, ఆ దురద కారణంగానే పవన్ కళ్యాణ్ పై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని గీతాకృష్ణ తెలిపారు.
ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంది..
ప్రకాష్ రాజ్ కు నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి లేదని ఆయన కూడా అన్ని గమనిస్తున్నారని ఎక్కడ నొక్కాలో అక్కడే తొక్కిపడస్తారు అంటూ గీతాకృష్ణ తెలిపారు. ప్రకాష్ రాజ్ ఎంతో అద్భుతమైన నటుడు ఆయనకు మంచి మంచి వేషాలు వస్తున్నాయి. సినిమాలలో ఎంతో మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఇలా సినిమాలు చేయకుండా బీజేపీతో గొడవ పడటం వేస్ట్ అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి కూడా ఫైనల్ గా అవార్డు ఇచ్చేది వాళ్లేనని లిస్ట్ ఢిల్లీ వెళ్లగానే అక్కడ నీ పేరుకు సున్నా చుట్టేస్తారు అంటూ గీతాకృష్ణ ప్రకాష్ రాజ్ గురించి ఈయన పవన్ కళ్యాణ్ గురించి చేసే వ్యాఖ్యలపై ఘాటుగా విమర్శలు చేశారు.
మంచి స్నేహితులు..
ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా సినిమాల పరంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం వీరి అభిప్రాయాలు వేరు కావడంతో తరచూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడమే కాకుండా ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దగా స్పందించడం లేదు. మరి తాజాగా గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Anasuya: హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ కు దూరం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన యాంకర్?