BigTV English

Ameesha Patel: పెళ్లి తరువాత అది వద్దంటున్నారు.. అందుకే నేను చేసుకోవడం లేదు

Ameesha Patel: పెళ్లి తరువాత అది వద్దంటున్నారు.. అందుకే నేను చేసుకోవడం లేదు

Ameesha Patel: బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు కుర్రకారు గుండెల్లో ఇప్పటికీ తన స్థానం పదిలమే. మొదటి సినిమా ఇచ్చిన హిట్ తో తెలుగును ఏలాలనుకున్న అమీషా ఆశలు అడియాశలు అయ్యాయి. తెలుగులో ఆశించిన అవకాశాలు, ఫలితాలు దక్కకపోవడంతో అమ్మడు బాలీవుడ్ లోనే పరిమితమయ్యింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ కనిపించే అమీషా కొన్నేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు.


ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్న హీరోయిన్స్ మధ్య 50 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోది అమీషా. అయితే ఎఫైర్స్ అనేవి సాధారణమే. బాలీవుడ్ లో చాలామంది నటులతో అమ్మడు ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వివాదాల ద్వారా ఈ చిన్నది మరింత గుర్తింపు తెచ్చుకుంది.  చెక్ బౌన్స్ కేసులు, మోసం చేసిన కేసులు.. ఇలా  లీగల్ గా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

అమీషా పని అయ్యిపోయింది.. అందాల ఆరబోత చేస్తున్నా.. ఆమె ముఖం మొత్తం ముడతలు పడి ముసలిదానిలా కనిపిస్తుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న సమయంలో గదర్ 2  ఆమెను మరోసారి ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఈ సినిమా విజయం తరువాత వరుస సినిమాలు అమ్మడి ముందు క్యూ కట్టాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొన్ని రోజులుగా అమీషా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమన్నాయి.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో  50 ఏళ్ళు వచ్చినా తానెందుకు పెళ్లి చేసుకోలేదో వివరించింది. ” కెరీర్ మొదలు పెట్టిన దగ్గరనుంచి నాకు ఎన్నో పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కూడా కాదు. కానీ, నాకు వచ్చిన ప్రపోజల్స్ అన్ని.. పెళ్లి తరువాత సినిమాలు చేయకూడదు.. సినిమాలు వద్దు అంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. మనం ప్రేమించినవాళ్లు మనం జీవితంలో ఎదగాలి.. ముందుకు వెళ్ళాలి అని కోరుకోవాలి కానీ, వెనక్కి లాగకూడదు.

గతంలో నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతను పెళ్లి తరువాత సినిమాలు వద్దు ఆపేయ్ అన్నాడు. ఇప్పటికే నా కెరీర్ కోసం నేను చాలా కోల్పోయాను. అతడి కోసం ఇంకోసారి కెరీర్ ను కోల్పోకూడదనిపించింది. అందుకే నా కెరీర్ కోసం ప్రేమను వదులుకున్నాను. పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని నేను చెప్పను. నన్ను అర్ధం చేసుకొని, నాకు తగినవాడు దొరికితే తప్పకుండా చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అమీషా చెప్పింది నిజమే కానీ, ఈ వయస్సులో ఇక పెళ్లి అనవసరం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Exclusive: రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌లో ‘రౌడీ జనార్ధన్‌’ షూటింగ్!

Bandla Ganesh: అవును… బండ్లన్న కామెంట్స్‌లో తప్పేముంది ?

Bandla Ganesh: బన్నీవాసు దెబ్బకు దిగొచ్చిన బండ్లన్న… ఆయన దేవుడు అంటూ ట్వీట్

Nazriya Nazim: ఫహాద్ తో విడాకుల రూమర్స్.. ఆ హీరోతో నజ్రియా రొమాన్స్

Nag Ashwin : కర్మను ఎవరు తప్పించుకోలేరు.. దీపికాకు డైరెక్టర్ కౌంటర్!

Manchu Manoj: మిరాయ్ ఎఫెక్ట్.. చిరుకు విలన్ గా మంచు మనోజ్ ..?

RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!

Big Stories

×