Gold Rate: మళ్లీ పెరిగిపోతున్న బంగారం ధరలు.. వరుసగా రెండు రోజులు తగ్గి.. బంగారంపై పసిడి ప్రియులకు ఆశలు కల్పించి మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,170 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,330 వద్ద పలుకుతోంది. అలాగే గురువారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,900 కాగా.. శుక్రవారం రోజూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,050 వద్ద కొనసాగుతుంది. అంటే 10 గ్రాముల బంగారం పై ఒక్కరోజే రూ.160 పెరిగిందని చెబుతున్నారు.
రైలులా దూసుకెళుతున్న బంగారం ధరలు..
అయితే బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. బంగారం తగ్గుతుంది.. ఇంకా కొనేయోచ్చు అనుకున్నారు.. కానీ, బంగారం మళ్లీ షాక్ ఇవ్వడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనేది అందిరి మైండ్‌లో తిరుగుతున్న ప్రశ్న..
ట్రంప్ టారీఫ్ ప్రభావం..
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల అంతర్జాతీయ సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనతతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో భారతదేశ రూపాయి విలువ మొత్తానికి పడిపోవడంతో బంగారం రేట్లు కూడా రైలులా పరిగెడుతున్నాయి. కానీ, ప్రస్తుతం మోదీ, ట్రంప్ మధ్య పెరిగిన స్నేహబంధం వల్ల ట్రంప్ టారీఫ్‌లు తగ్గించే అవకాశం ఉందేమో అని అంటున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,11,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,050 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,050 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,050 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,200 వద్ద పలుకుతోంది.
Also Read: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలుకు ఏమాత్రం తగ్గుకుండా సిల్వర్ ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,41,000 కాగా శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ.1,43,000 వద్ద పలుకుతోంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ.2,000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,33,000 వద్ద కొనసాగుతోంది.