Ananya Nagalla: సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ ఇండస్ట్రీలోకి ఎవరైనా వచ్చినా కూడా హీరోయిన్ పాత్రలలో కాకుండా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇక తెలుగు సినీ దర్శక నిర్మాతలు కూడా సినిమాలలో హీరోయిన్లుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలని తీసుకొస్తున్నారు తప్పా, తెలుగు వారికి అవకాశాలు కూడా ఇవ్వడం లేదనే చెప్పాలి. ఇలా కారణాలు ఏవైనా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొనసాగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చి సపోర్టింగ్ పాత్రలలోను హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నటి అనన్య నాగళ్ళ(Ananya Nagalla) ఒకరు.
ఈమె తెలుగు అమ్మాయి అనే సంగతి మనకు తెలిసిందే. ప్రియదర్శని హీరోగా నటించిన మల్లేశం (Mallesham)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనన్య అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో సపోర్టింగ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగులో మాస్ట్రో, శాకుంతల, మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్రం, పొట్టేలు ఆంటీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులలో భాగంగా ఈమె గద్దర్ తెలంగాణ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
ఎక్కడకు వెళ్లిన అవకాశాలు ఉండవు..
ఇక ఇటీవల ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్న అనన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనన్య తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎవరని వారిని తొక్కేస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ మన ఇండియాలో ఏ భాషలో అయినా అమ్మాయిలకు యాక్టింగ్ పరంగా కానీ ఆర్ట్ పరంగా కానీ తెలుగు వారు కష్టపడినంతగా కష్టపడరని నా అభిప్రాయం. సినిమా ఇండస్ట్రీలోనే ఒక 100 సినిమాలు చేస్తే అందులో 80 శాతం ఇతర భాష హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు.
అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాలి..
ఇక తెలుగులో మనకు పెద్దగా అవకాశాలు రాలేదని, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు వెళ్తే అక్కడ ఆ భాష హీరోయిన్లకు 80 శాతం అవకాశాలు ఇస్తారు, మనకు అక్కడ కూడా 20 శాతం ఇస్తారని తెలిపారు. ఇలా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు అవకాశాలు రావడంలేదని అయినప్పటికీ ఎంతో మెంటల్ టెన్షన్ ఎదుర్కొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు నుంచి కూడా ఇండస్ట్రీలోకి చాలామంది అమ్మాయిలు రావడానికి ఆసక్తి చూపుతున్నారని అనన్య తెలియచేశారు. ఇలా తెలుగు వాళ్ళు ఇండస్ట్రీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఈమె తన మనసులో భావాలను తన ఆవేదనను బయటపెట్టారు.
Also Read: Tejaswi Madivada: పెళ్లి చేసుకోను.. పిల్లలను మాత్రం కంటా.. తేజస్వీ బోల్డ్ కామెంట్స్