Ananya Pandey:సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటు హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటువైపు ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ముఖ్యంగా బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే తాను కూడా అలాంటి బాధితురాలనే అంటూ చెప్పుకొచ్చింది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)హీరోయిన్ అనన్య పాండే(Ananya Pandey) . తెలుగులో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా ఈమెకు పెద్దగా విజయాన్ని అందించలేదు. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో అటు అనన్య కూడా తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇదే విషయంపై అనన్య పాండే మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది నా బాడీ పైన కామెంట్లు చేశారు. చాలామంది నీ హెడ్ లైట్స్ బాలేవంటూ చేసిన కామెంట్లను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అప్పటి నుంచి ఇకపై ఇలాంటివేవి పట్టించుకోకుండా కెరియర్ పైనే దృష్టి పెట్టాను. మనం ఎలా ఉన్నా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను”.. అంటూ అనన్య పాండే తెలిపింది. ప్రస్తుతం అనన్య పాండే చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ పై ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
అనన్య పాండే సినిమాలు..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రెండు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తోంది. అయితే ఆ రెండు చిత్రాలు కూడా బాలీవుడ్ సినిమాలే కావడం గమనార్హం.
అనన్య పాండే కెరియర్..
అనన్య పాండే విషయానికి వస్తే తెలుగు, హిందీ సినిమాలలో నటించిన ఈమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు.. ఈమె తాత ఎవరో కాదు శరత్ పాండే. భారతీయ హార్ట్ సర్జన్ గా ఆయన పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ సేథ్ గోర్ధం దాస్ సుందర్ దాస్ మెడికల్ కాలేజీలో దేశంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి చేసిన సర్జన్ బృందంలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు టెలివిజన్ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ALSO READ:Star Heroine: అందుకే మగవాడికి దూరం.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్!