E-Paper
Advertisement

Anasuya Bharadwaj: అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. నిందితుడు అరెస్ట్..!

Anasuya Bharadwaj: అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. నిందితుడు అరెస్ట్..!
Advertisement

Anasuya Bharadwaj: నటి.. యాంకర్ అయినా అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

అనసూయనే లక్ష్యంగా చేసుకొని మితిమీరిన వ్యక్తి..!

పోలీసుల వివరాల ప్రకారం, కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి అనసూయను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలకు ఎక్కువ వ్యూస్ మరియు ఫాలోవర్లు రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం.

ఫోటోలు.. వీడియోలను మార్ఫింగ్..!

Advertisement

జనార్దన్ అనసూయకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలను మార్ఫింగ్ చేసి, వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు కూడా పెట్టి, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న అనసూయ, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అతడిని కడపలో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

పోలీసులు విచారణ జరిపినప్పుడు జనార్దన్ తానే ఆ పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటనతో సోషల్ మీడియాలో బాధ్యతతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. సెలబ్రిటీలపై మాత్రమే కాదు, ఎవరి మీదైనా అసభ్యకర పోస్టులు పెట్టడం సైబర్ నేరంగా పరిగణించబడుతుందని అధికారులు తెలిపారు.

ALSO READ: Allu Arvind: అల్లు స్టూడియోస్ వెనుక అల్లు అరవింద్ కోరికే కారణమా..ఆ థియేటర్ చూసి ఈర్ష్య పడ్డారా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×