BigTV English

Anchor Suma: ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్‌ ప్రారంభించిన సుమ.. వారి కల నెరవేరనుందా?

Anchor Suma: ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్‌ ప్రారంభించిన సుమ.. వారి కల నెరవేరనుందా?

Anchor Suma: టాలీవుడ్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ కనకాల(Suma Kanakala) ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈమె ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే తాజాగా సుమా కనకాల కైరలీ ఎడ్యుకేషన్ సొసైటీ(Kairali Educational Society) హైదరాబాద్ ఎన్జీఓ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్‌ ” (Twinkle Toes pre primary School) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమతో పాటు ప్రముఖ భారతీయ టెలివిజన్ ప్రజెంటర్ , నటి మరియు నిర్మాత & శ్రీమతి సునీతా శేఖర్ యాదవ్ , కార్పొరేటర్ మౌలాలి డివిజన్ , గౌరవ అతిథిగా పాల్గొన్నారు.


శ్రీ ఇ సుకుమారన్(E.Sukumaran), ప్రెసిడెంట్ కైరలీ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్, కల్నల్ పి సుందరేశ్వరన్ (రిటైర్డ్), సెక్రటరీ మరియు అకడమిక్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ పికె కృష్ణన్ ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్‌  స్కూల్స్ ద్వారా జీవితంలో ఎంతో ఉన్నత చదువులు చదువుకోవాలని కలలు కంటున్న నిరుపేద విద్యార్థుల కల సహకారం కోసమే ఏర్పాటు చేయబడిందని తెలుస్తోంది. ఈ పాఠశాలలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడుతున్నారు.

నిరుపేద విద్యార్థులకు..


కైరలీ ఎడ్యుకేషన్ సొసైటీ 1993లో స్థాపించబడింది. ఇలాంటి లావాదేవీలను ఆశించకుండా కేవలం నిరుపేద విద్యార్థుల చదువుకోసమే ఈ సొసైటీ ప్రారంభించబడిందని తెలియజేశారు. ఇప్పటికే నేరేడ్‌మెట్‌లో కైరలీ విద్యాభవన్‌ను నడుపుతోంది, ఇది ప్రముఖ మాంటిస్సోరి విద్యావేత్త అయిన క్రీడోతో కలిసి ఈ ప్రైమరీ ట్వింకిల్ టోట్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యారంగంలో సానుకూల ప్రభావం చూపించాలనే లక్ష్యంతో ఈ సొసైటీ ఏర్పాటు అయిందని తెలిపారు.ఏ ఎస్ రావు నగర్‌ లోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్న ఈ పాఠశాలలో అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత చదువులను చదువుకుంటున్నట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయి విద్యా విధానం…

ట్వింకిల్ టోట్స్ లో కేవలం రాష్ట్రస్థాయి పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా ఇక్కడ జాతీయ విద్యా విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత చదువులు చెప్పిస్తూ నిరుపేద విద్యార్థుల కలల సాకారానికి కృషి చేస్తున్నామని, కైరలీ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ ఇ సుకుమారన్ తెలియజేశారు. ఇలా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తున్నారని చెప్పాలి.

Also Read: టీజర్ లీక్… మూడు రోజుల ముందే కుట్ర… పోలీస్ కంప్లైట్ ఇచ్చిన టీం

Related News

Salman Khan: సల్మాన్ ఖాన్ తో నటిస్తే మరణమే .. ఆందోళనలో బాలీవుడ్..ఇది వారి పనేనా?

Actor Satya Dev: మూడ్ సరిగ్గా లేకపోతే చేసేది ఆ పనే… వ్యసనంలా మారిపోయిందంటున్న సత్య దేవ్!

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Big Stories

×