రివ్యూ : ‘సితారే జమీన్ పర్’ హిందీ మూవీ
నటీనటులు : అమీర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, ఆరుష్ దత్తా, సిమ్రాన్ మంగేష్కర్, వేదాంత్ శర్మ, గోపీ కె వర్మ, డాలీ అహ్లువాలియా తదితరులు
దర్శకుడు: ఆర్.ఎస్. ప్రసన్న
నిర్మాతలు : అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్
Sitaare Zameen Par Review in Telugu : మూడేళ్ళ బ్రేక్ తరువాత మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా విడుదలైన Sitaare Zameen Par అనే ఈ హిందీ స్పోర్ట్స్ కామెడీ-డ్రామా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ డబ్బింగ్ వెర్షన్ లలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇది 2007లో వచ్చిన Taare Zameen Parకి సీక్వెల్‌గా, 2018 స్పానిష్ చిత్రం Campeones అధికారిక రీమేక్‌గా రూపొందింది. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న అమీర్ ఖాన్ ఈ మూవీతోనైనా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
గుల్షన్ అరోరా (ఆమిర్ ఖాన్) అనే ఒక కోపిష్ఠి బాస్కెట్‌బాల్ అసిస్టెంట్ కోచ్ కథ ఇది. తన సినీయర్ కోచ్‌ను కొట్టినందుకు సస్పెండ్ అవుతాడు. అలాగే మత్తులో డ్రైవింగ్ చేసి జైలుకు వెళతాడు. అతను చేసిన తప్పుకు శిక్షగా సమాజ సేవ చేయాల్సి వస్తుంది. న్యూరోడైవర్జెంట్ (డౌన్ సిండ్రోమ్, ఆటిజం, ఫ్రాజైల్ సిండ్రోమ్) ఉన్న యువకుల బాస్కెట్‌బాల్ టీమ్‌ను మూడు నెలల్లో జాతీయ టోర్నమెంట్‌కు సిద్ధం చేయాలని గుల్షన్ కు పైనుండి ఆదేశం వస్తుంది. మొదట్లో పిచ్చి వాళ్ళని తేలిగ్గా తీసుకున్న గుల్షన్ తరువాత వారి ఉత్సాహం, జోవియల్ నేచర్, టాలెంట్ చూసి క్రమంగా మారతాడు. తన భార్య సునీతా (జెనీలియా దేశ్ముఖ్)తో ఉన్న వైవాహిక సమస్యలు, చైల్డ్ హుడ్ ట్రామాలను ఎదుర్కొంటున్న గుల్షన్ తన టీంను టోర్నమెంట్ కు ఎలా రెడీ చేశాడు? అనేది ఈ మూవీ స్టోరీ.
విశ్లేషణ
ఈ స్పోర్ట్స్ డ్రామా మొత్తంగా చూసుకుంటే ఒక హార్ట్ టచింగ్ ఫీల్-గుడ్ సినిమా. న్యూరోడైవర్జెంట్ వ్యక్తుల జీవితాలను సెన్సిటివ్ గా, మనసుకు హత్తుకునేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, గుల్షన్ అండ్ టీమ్ మధ్య ఇంటరాక్షన్స్ నవ్విస్తాయి. అమీర్ ఖాన్ కమిటెడ్ పెర్ఫార్మెన్స్, న్యూరోడైవర్జెంట్ యాక్టర్స్ అథెంటిక్ ఎనర్జీ, కామెడీ-ఎమోషన్ మిక్స్ సినిమాకు బలం. అయితే సెకండ్ హాఫ్ డ్రాగ్, ప్రిడిక్టబుల్ ప్లాట్, అతిగా ఉన్న సెంటిమెంట్ మైనస్ పాయింట్స్.
‘తారే జమీన్ పర్’ లాగా ఈ మూవీ ఎమోషనల్ హైట్స్‌ను అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఒక డీసెంట్, ఎంజాయబుల్ మూవీ అని చెప్పవచ్చు. అయితే కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. న్యూరోడైవర్జెంట్ పాత్రలకు వ్యక్తిగత బ్యాక్‌స్టోరీలు లేకపోవడం మరో మైనస్. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం బాగానే ఉంది. కానీ ‘తారే జమీన్ పర్’ స్థాయిలో మరపురాని ట్యూన్స్ మాత్రం అందించలేకపోయారు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు సూటబుల్. అయితే ఈ సినిమా ఢిల్లీ నేపథ్యంలో ఉండడం అనేది తెలుగు ఆడియన్స్ కు కొంత డిస్కనెక్ట్ అవ్వచ్చు. కానీ యూనివర్సల్ థీమ్స్ మాత్రం కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు
సినిమాలో నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమీర్ ఖాన్ గుల్షన్ అరోరాగా అద్భుతంగా నటించాడు. మొదటి భాగంలో అహంకారిగా, రెండో భాగంలో ఎమోషనల్‌గా మారే పాత్రను సమర్థవంతంగా పోషించాడు. న్యూరోడైవర్జెంట్ యాక్టర్స్ (అరౌష్ దత్త, సిమ్రన్ మంగేఖర్, ఆశిష్ పెండ్సే, నమన్ మిశ్రా, గోపీకృష్ణ వర్మ తదితరులు) సినిమాకు హైలైట్. వారి అథెంటిక్, జోవియల్ పెర్ఫార్మెన్స్ హృదయాన్ని కరిగిస్తుంది. జెనీలియా సునీతాగా సపోర్టివ్ భార్య పాత్రలో చక్కగా నటించింది. అయితే ఆమెది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. డోలీ అహ్లువాలియా, బృజేంద్ర కాలా, గురపాల్ సింగ్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
అమీర్ ఖాన్
న్యూరోడైవర్జెంట్ యాక్టర్స్
కామెడీ
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
సన్నివేశాల సాగదీత
చివరగా
‘తారే జమీన్ పర్’లో సోల్ ఉంటే, ‘సీతారే జమీన్ పర్’ స్ఫూర్తిని ఇస్తుంది. చాలా కాలంగా తెరపై కనిపించకుండా పోయిన అమీర్ ఖాన్‌ను మిస్ అవుతున్నా, లేదా ఎమోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూడాలనుకుంటే ఇది మీ కోసమే.
Sitaare Zameen Par Rating : 2.25/5