BigTV English

Alia Bhatt: అలియా గొప్ప మనసు.. ఇంట్లో పని వారికి ఖరీదైన కానుకలు గ్రేట్ అంటూ!

Alia Bhatt: అలియా గొప్ప మనసు.. ఇంట్లో పని వారికి ఖరీదైన కానుకలు గ్రేట్ అంటూ!

Alia Bhatt: అలియా భట్(Alia Bhatt) పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన అలియా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా ఈ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తదుపరి అలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.


పుట్టినరోజు ప్రత్యేకం..

ఇదిలా ఉండగా తాజాగా ఆలియా భట్ కు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా సినిమా సెలబ్రెటీలు ఎంతో విలాసవంతమైన భవనాలలో ఉంటూ ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆలియా భట్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం అని చెప్పాలి. ఈమె తాజాగా తన ఇంట్లో పనిచేస్తున్న సునీల్(Suniel), అమోల్(Amool) అనే వ్యక్తులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తుంది. అలియా పుట్టినరోజు(Birthday) సందర్భంగా వీరిద్దరికీ ఊహించని విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.


50 లక్షలు ఆర్థిక సహాయం..

వీరిద్దరూ అలియాస్ సినీ కెరియర్ ప్రారంభించిన మొదటి నుంచి ఇప్పటివరకు తన ఇంట్లో పని చేస్తూనే ఉన్నారట. అయితే వీరిద్దరూ తన ఇంట్లో పనివాళ్ళు కాకుండా, సొంత కుటుంబ సభ్యులుగా కలిసిపోయారని అందుకే అలియా భట్ వారికి తన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తుంది. ఇలా అలియా భట్ ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడంతో వీరిద్దరూ ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆ డబ్బుతో ఇంటిని కొనుగోలు చేసి సొంత ఇంటి కల నెరవేర్చుకోబోతున్నట్లు తెలియజేశారు. ఇలా తన డ్రైవర్ల కోసం అలియా భట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు.

రణబీర్ తో వివాహం..

అలియా భట్ మాదిరిగానే ఇతర సెలబ్రిటీలు కూడా వారి దగ్గర పని చేసే వారికి ఇలా అండగా నిలవాలంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా అలియా భట్ చేసిన ఈ పనిపై అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి గొప్ప మనసు అందరికీ రాదని నిజంగా ఆలియా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అలియా భట్ విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు రాహా (Raha)అనే కుమార్తె కూడా జన్మించారు. ప్రస్తుతం రణబీర్ రామాయణం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు.అలియా భట్ సైతం పలు సినిమాలలోఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Tourist Family Film : 7 కోట్ల బడ్జెట్.. 90 కోట్ల కలెక్షన్స్.. ఈ ఏడాది టాప్ సినిమాగా రికార్డు?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×