E-Paper
Advertisement

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!
Advertisement

Aneet Padda:అనీత్ పడ్డా..బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ గా క్రేజ్ కొట్టేసిన ఈ ముంబై ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి తన ట్రెండీ లుక్స్‌తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. విషయం ఏదైనా తనదైన స్టైల్‌లో ఫ్యాన్స్ తో అప్ డేట్స్ షేర్ చేసుకునే ఈ అమ్మడు తాజాగా దీపావళి ఫెస్టివల్ కి దిగిన ఫోటోలని లేట్ గా షేర్ చేసి మరో సారి నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది.

పైగా లేట్ గా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ‘లవ్ అండ్ లైట్, ఆల్వేస్’ అంటూ ఆమె పెట్టిన చిన్న క్యాప్షన్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది .ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూనే, తన సింపుల్ లుక్‌తో గ్లామర్‌ను పండించవచ్చని మరోసారి ప్రూవ్ చేసింది అనీత్. ముఖ్యంగా ఆమె స్టైలిష్ హెయిర్ స్టైల్, జువెలరీతో పాటు వదిలిన చిన్న స్మైల్ ఫొటోలకి మరింత అట్రాక్షన్ తీసుకువచ్చిందని చెప్పాలి.

Advertisement

ఇక అనీత్ పడ్డా సినీ కెరీర్ విషయానికి వస్తే ఈ అమ్మడి పేరు చెబితే అందరికి ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘సైయారా’. అహాన్ పాండేతో కలిసి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమాతోనే అనీత్ ఒక రకంగా బాలీవుడ్ లో పాతుకుపోయిందని చెప్పాలి. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వాణి బాత్రా పాత్రలో అనీత్ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ .

అయితే అనీత్ సైయారా కంటే ముందే బాలీవుడ్ లో అడుగు పెట్టిందండోయ్..అవును .. కాజోల్ లీడ్ రోల్ లో వచ్చిన ‘సలామ్ వెంకీ’ సినిమాలో చిన్న పాత్రలో దర్శమిచ్చింది ఈ బ్యూటీ.ఇక ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ వెబ్ సిరీస్‌లో రూహి అహుజా పాత్ర పోషించి తన సత్తా చూపింది ఈ అమ్మడు.అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా స్టోరీలో తనకంటూ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కూడా చేస్తానంటూ వరుస ప్రాజెక్ట్ లతో ప్రూవ్ చేసుకుంది.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ‘హుంకార్: ది రోర్’ వెబ్ సిరీస్‌లో మీను రావత్ పాత్రలో కనిపించి మెప్పించింది అనీత్. గతంలో చేసిన రొమాంటిక్ రోల్స్‌ కాకుండా సీరియస్ ఎమోషన్స్‌తో పండించి అదరగొట్టింది.ఇక ప్రస్తుతం మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న ‘శక్తి శాలిని’ చిత్రంలో కీ రోల్ పోషిస్తుంది ఈ భామ.

ఇక డిసెంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి కూడా.పైగా తనకి అచ్చి వచ్చిన మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండేతో మరో సినిమాకి సై అనేసింది ఈ ముద్దుగుమ్మ.

మొత్తానికి ఒక వైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే మరో వైపు నెట్టింట తనవైన పోస్టులతో మంటలు పెట్టేస్తుంది ఈ అందాల భామ.ఇదిగో అందులో భాగంగానే పెట్టిన దీపావళి విషెస్ పోస్టుకు ఊహించని విధంగా రెస్పాన్స్ దక్కుతుంది.చూడాలి మరి సైయారా తో బాలీవుడ్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన ఈ బ్యూటీ వచ్చే సినిమాలతో ఎలాంటి రికార్డులని కొల్లగోడుతుందో !

Tags

Related News

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

ఇండస్ట్రీలోకి వచ్చాక చెడిపోవాలా? శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !

Big Stories

Advertisement
×