Sivaji Raja:శివాజీ రాజా..తెలుగు సిని ఇండస్ట్రీలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఈ క్రేజీ యాక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ, పర్సనల్ లైఫ్, ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులపై తనదైన శైలిలో ఓపెన్‌గా చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా తన కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల గురించి మాట్లాడుతూ ‘ప్రేయసి రావే’ సినిమాలోని ఎమోషనల్ సీన్‌ను గుర్తు చేసుకున్నారు. భార్య సంతోషం కోసం తన గుండెను దానం చేసే ఆ రోల్ దక్కడం నిజంగా తన అదృష్టమని, పాత్ర చిన్నదైనా సరే ఆడియన్స్ మనసులో నిలిచిపోతేనే నటుడికి అసలైన గుర్తింపు వస్తుందని అన్నారు. అలాగే తన కెరీర్‌లో ‘ఖడ్గం’ సినిమాకు ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక జీవితంలో అసలైన అదృష్టవంతుడు ఎవరనే విషయంపై శివాజీ రాజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉంటాయని, కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హెల్దీగా ఉన్నవాడే నిజమైన అదృష్టవంతుడని స్పష్టం చేశారు.
గతంలో తాను ఆరోగ్యం బాగా లేక ఏకంగా 22 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చిందని, డిశ్చార్జ్ అయిన వారం రోజులకే మళ్లీ షూటింగ్‌కు వెళ్లిపోయానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన దగ్గర కారు కూడా లేకపోయినా ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ పని చేశానని తెలిపారు.
ఇక ఇండస్ట్రీకి వచ్చాకే చెడు అలవాట్లు వస్తాయనే మాటను ఆయన కొట్టిపారేశారు. తాను ఇప్పటికీ సిగరెట్ ముట్టనని, మనం చెడిపోవాలని అనుకోకపోతే బయట ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎవరూ మనల్ని చెడగొట్టలేరని చెప్పారు. కొత్తగా సినిమాల కోసం ట్రై చేసేవాళ్లకు సలహా కూడా ఇస్తూ అవకాశాల కోసం నిర్మాతలు లేదా దర్శకులు డబ్బులు అడిగితే అలాంటి ప్రాజెక్ట్‌లకు చేయొద్దని హితవు పలికారు. ఒక ఛాన్స్ పోయినా పర్లేదు కానీ డబ్బులిచ్చి వేషాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదని ఘాటుగా చెప్పారు.
ఇక దర్శకుడు కృష్ణవంశీతో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రశ్నకి సమాధానమిస్తూ తమ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్‌ను మాటల్లో చెప్పలేమని, ఏదైనా డిస్కషన్ వస్తే ఇద్దరూ చాలా సీరియస్‌గా వాదించుకుంటామే తప్ప ఒకరినొకరు విడిచి ఉండలేమని సరదాగా చెప్పుకొచ్చారు.
మరోవైపు తాను ఈ మధ్య చూసి ఆశ్చర్యపోయిన సినిమా ‘రామాయణం’ అని, అలాంటి విజువల్ వండర్‌ను మరొకరు అదే రేంజ్‌లో తీయడం అసాధ్యమని తన అభిప్రాయాన్నిబయటపెట్టారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ లాంటి వాటిపై తనకు పెద్దగా నమ్మకం లేదని ఇతరులపై అసూయ పెంచుకుని, చెడుగా మాట్లాడుతూ దేవుడికి ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని, మనం మంచిగా ఉండటమే అసలైన దైవత్వమని చెప్పిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
ALSO READ :చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?