E-Paper
Advertisement

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !
Advertisement

Divi Vadthya:దివి వాధ్యా..బిగ్ బాస్ బ్యూటీ గా క్రేజ్ కొట్టేసిన ఈ భామ సోషల్ మీడియాలో తనవైన గ్లామర్ అండ్ ట్రెడిషనల్ పిక్స్ తో అభిమానులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు దీపావళి ఫెస్టివల్ అయిపోయినప్పటికీ లేట్ గా షేర్ చేసిన ఒక స్పెషల్ ఫోటో ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా సెలబ్రిటీలంతా పండుగ రోజునేగ తమ ఫెస్టివల్ లుక్స్ పోస్ట్ చేస్తుంటారన్నది తెల్సిందే.కానీ దివి మాత్రం దీపావళి అయిపోయిన తర్వాత ‘Diwali late post’ అంటూ ఒక చిన్న క్యాప్షన్ ఇచ్చిన పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఈ ఫోటోలో పసుపు రంగు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ వేసుకుని ట్రెడిషనల్ అండ్ సింపుల్ జువేలరీతో చేతిలో హారతి పళ్లెం పట్టుకుని మెరిసిపోతున్న ఫోటోలని చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

పండుగ అంటే అందరిలా కేవలం కొత్త బట్టలు, గ్లామర్ ఫోటోషూట్లు చేయకుండా ఇలా ఇంట్లో దీపాలు వెలిగించడం, భక్తితో పూజలు చేయడం దివి స్పెషాలిటీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.ఇక మరికొంత మంది కేవలం గ్లామర్ లుక్స్ లోనే కాకుండా ఇలాంటి సంప్రదాయ లుక్స్‌లోనూ చాలా అందంగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. పండుగ రోజు పోస్ట్ చేయకపోయినా, తర్వాత ఇలా ఒక మంచి మెమరీని అభిమానులతో పంచుకోవడంతో దివి పోస్ట్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.

ఇక దివి వాధ్యా కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ క్రమంగా సినిమాల్లోకి వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాలో ఒక చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు అలరించింది ఈ అమ్మడు.

Advertisement

ఇక ఆ తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘క్యాబ్ స్టోరీస్’ వంటి ప్రాజెక్టులతో తనని తాను ప్రూవ్ చేసుకున్న దివికి అసలైన గుర్తింపు, క్రేజ్ మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారానే వచ్చిందని చెప్పాలి. ఈ రియాలిటీ షోతోనే లక్షలాది మంది ప్యాన్స్ ని సంపాదించేసింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి అవకాశాల్నే పట్టేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఒక కీ రోల్ చేసిన ఈ భామ ఆ తర్వాత ‘జిన్నా’, ‘రుద్రంగి’, ‘లంబసింగి’, ‘సింబా’, ‘లవ్ మీ’ వంటి సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘పుష్ప: ది రైజ్’ తో పాటు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాల్లోనూ కనిపించి ఆకట్టుకుంది కూడా.అంతేకాకుండా సన్నీ డియోల్ నటిస్తున్న హిందీ చిత్రం ‘జాట్’తో పాటు 2026లో వచ్చిన ‘హనీ’ సినిమాలోనూ నటించి ఇతర భాషలలో సత్తా చాటిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘నెపోలియన్ రిటర్న్స్’ ప్రాజెక్ట్‌ తో బిజీగా గడిపేస్తుంది.

మొత్తానికి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ అప్‌డేట్స్, గ్లామరస్ ఫోటోషూట్లు, ట్రెడిషనల్ మెమరీస్ ని పంచుకుంటుంది దివి.ఇక ఈ క్రమంలోనే పండుగ రోజు కాకుండా కాస్త లేటుగా ఆమె ట్రెడిషనల్ లుక్ నెట్టింట్లో వదలగా అది అభిమానులకు మంచి ఫెస్టివల్ ట్రీట్‌లా నిలిచిపోయిందనే చెప్పాలి.

Tags

Related News

హీరో సూర్య మూవీకి అక్కడ షాక్.. ‘రామాయణ’ కలెక్షన్స్ ఎంతంటే..?

చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

కిర్రాక్ సీత నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది..? నిజంగా గ్రేట్ కదా..

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాక చెన్నైకి వెళ్లిపోయా.. బిందు మాధవి షాకింగ్ కామెంట్స్!

రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ

వారణాసి రూ.290 కోట్ల డీల్ నిజమేనా? అసలు విషయం చెప్పేసిన దిల్ రాజు!

బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×