Tollywood : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. తమ అందం, అభినయంతో ఆలరించిన ముద్దుగుమ్మలు ఒకానొక సందర్భంలో భయంకరమైన వ్యాధుల బారిన పడ్డారు. చాలామంది హీరోయిన్లు భయంకరమైన క్యాన్సర్ తో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా మారుతున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయటపడిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు? ఇప్పుడు ఆ హీరోయిన్లు ఏం చేస్తున్నారు అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
క్యాన్సర్ ఈ పేరు వింటేనే జనాల్లో ఒక భయం పుట్టుకొస్తుంది. ఒకప్పుడు క్యాన్సర్ అనేది అతి భయంకరమైన వ్యాధి. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరగడంతో పాటుగా ఈ వ్యాధిని నయం చేసేందుకు వైద్యులు కూడా సరికొత్త ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం క్యాన్సర్ కు చికిత్స ఉండడంతో ఎక్కువ మంది ఈ వ్యాధి నుంచి బయటపడి తమ జీవితాన్ని సాఫీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరు ఎలాంటి క్యాన్సర్ తో పోరాడారు అన్న విషయాన్ని తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న గౌతమి గురించి అందరికీ తెలుసు.. ఈమె ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ తో బాధపడి మృత్యువుని జయించి ప్రాణాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం పాపగా పేరు తెచ్చుకున్న హంస నందిని ఒకప్పుడు క్యాన్సర్ తో బాధపడిన విషయం తెలిసిందే. అతి భయంకరమైన రొమ్ము క్యాన్సర్ తో ఈమె బాధపడింది. క్యాన్సర్ కారణంగా ఆమె ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాలి బింద్రే కూడా ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ళు ఆమె క్యాన్సర్ తో పోరాడి చివరికి విజయాన్ని సాధించింది. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం తన కుటుంబానికి దగ్గరగా ఉంటూ ఫ్యామిలీని హ్యాపిగా చూసుకుంటుంది.
వీళ్లు మాత్రమే కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మమతా మోహన్ దాస్, మనీషా కోయిరాలా, హీనా ఖాన్, మహిమా చౌదరి, ముంతాజ్ వంటి వాళ్లు ఉండగా, ఇప్పుడు ఈ లిస్టులోకి యంగ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా చేరింది.. ఇటీవలే ఆమె క్యాన్సర్ నుంచి బయటపడిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరంతా కూడా క్యాన్సర్‌ను గెలిచి నిలిచిన ధీరవనితలే.. భయంకరమైన మహమ్మారి క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలను దక్కించుకొని వీరనారీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ముద్దుగుమ్మలు.
Also Read :హీరో సూర్య మూవీకి అక్కడ షాక్.. ‘రామాయణ’ కలెక్షన్స్ ఎంతంటే..?