E-Paper
Advertisement

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!
Advertisement

Chandini Chowdary:విశాఖపట్నం.. ప్రశాంతమైన సముద్ర తీరానికి.. ప్రకృతి అందాలకు.. పచ్చని కొండలకు పెట్టింది పేరు. ఆధునికత, పట్టణీకరణ పేరుతో నగరంలో జరుగుతున్న కొండల తవ్వకాలపై ఒక టాలీవుడ్ హీరోయిన్ వైజాగ్ ను కాపాడండి అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పచ్చని కొండలను తవ్వేస్తూ.. పట్టణ ఆధునీకరణ కోసం అంటూ చేపట్టిన పనులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయంటూ ఆమె కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వైజాగ్ ను కాపాడండి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్..

ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) తన సొంత ఊరు అయిన వైజాగ్ లో ప్రకృతి విధ్వంసం జరుగుతోందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.” నా సొంత నగరం వైజాగ్ పరిస్థితిని చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. అభివృద్ధి, పట్టణీకరణ పేరుతో ఎటు చూసినా కొండలు, పర్వతాలను నిర్దాక్షిణ్యంగా తవ్వేస్తూ , నరికేస్తున్నారు. నగరంలోని పచ్చదనం, సహజ సిద్ధమైన కొండలు కనుమరుగవుతుండడం నన్ను మరింత కలిచివేసింది ” అంటూ ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది చాందిని చౌదరి.

#SaveVizag హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లోకి..

Advertisement

ఇక ఈ మేరకు #SaveVizag హ్యాష్ ట్యాగ్ జోడించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యావరణ ప్రేమికులు , సామాన్య ప్రజలు, పలువురు నెటిజనులు కూడా ఆమె వ్యాఖ్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. నగర అభివృద్ధి అవసరమే అయినప్పటికీ కూడా పర్యావరణాన్ని నాశనం చేస్తూ భవిష్యత్తు తరాలకు ప్రకృతి లేకుండా చేయడం సరైనది కాదు అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

 

అప్పుడు కళ్ళు మూసుకుపోయాయా?

Advertisement

ఇక ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ కూడా మొదలయ్యింది. కొంతమంది నెటిజన్స్ ఆమె పోస్ట్ పై.. స్పందిస్తూ గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో రుషికొండను తొలిచి భవనాలు నిర్మించినప్పుడు ఎందుకు స్పందించలేదు. అప్పుడు కళ్ళు మూసుకుపోయాయా అంటూ రాజకీయ కోణంలో కూడా ఈమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా చాందినీ చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

also read:జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

చాందినీ చౌదరి సినిమా ప్రస్థానం..

ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె విశాఖపట్నంలోనే పుట్టి , పెరిగి తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుంది. నటనపై ఇష్టంతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేసిన ఈమె.. చాయ్ బిస్కెట్ వంటి డిజిటల్ వేదికల్లో వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ ‘ది బ్లైండ్ డేట్’ వంటి వీడియోలతో యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అదే పాపులారిటీతో 2015లో కేటుగాడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన చాందినీ చౌదరి, కుందనపు బొమ్మ, సమంతకమణి,హౌరా బ్రిడ్జి , మను వంటి చిత్రాలతో తన నటన ప్రతిభను చాటుకుంది. ఇక ఈమె కెరీర్ కు అతిపెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం కలర్ ఫోటో . సుహాస్ సరసన 2020లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక అలాగే గామి , డాకు మహారాజ్ వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషించిన ఈమె.. ఝాన్సీ, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వంటి వెబ్ సిరీస్ లలో కూడా అలరించింది.

Related News

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

ఇండస్ట్రీలోకి వచ్చాక చెడిపోవాలా? శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !

హీరో సూర్య మూవీకి అక్కడ షాక్.. ‘రామాయణ’ కలెక్షన్స్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×