E-Paper
Advertisement

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి  సినిమా ఎవరితోనో ?
Advertisement

Anil Ravipudi:అనిల్ రావిపూడి..టాలివుడ్ హిట్ మిషిన్ గా క్రేజ్ కొట్టేసిన ఈ యంగ్ ఫిలిమ్ మేకర్ చుట్టూ ఇపుడొక క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతుంది. ‘పటాస్’ నుంచి మొన్నటి ‘శంకర వర ప్రసాద్ గారు ‘సినిమా వరకు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనే టాక్ ఇపుడు జోరుగా షికారు చేస్తుంది.

హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కామెడీ, మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలిపి హిట్ కొట్టడం అనిల్ కి వెన్నతో పెట్టిన విద్య అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక పవన్‌కు ఉన్న కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం పక్కా అని ఇప్పటి నుండే కలలు కంటున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

గతంలో ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో పవన్ చేసిన అల్లరి అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేదు కూడా.దీంతో పవన్ లాంటి నటుడు అనిల్ లాంటి క్రేజీ ఫిలిమ్ మేకర్ తో జోడీ కడితే థియేటర్లలో ఆ కిక్కే వేరేలా ఉంటుందని లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

పైగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి నిర్మాత దిల్ రాజు అంటూ పేరు కూడా ఒక రేంజ్ లో వినిపిస్తుంది. గతంలో పవన్‌తో ‘వకీల్ సాబ్’ లాంటి సూపర్ హిట్ తీసిన దిల్ రాజు తీసిన సంగతి తెల్సిందే.పైగా పవన్ తో మరోసారి సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు కూడా.

Advertisement

మరోవైపు అనిల్ రావిపూడితో కూడా 2028లో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమాలో హీరో ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా పెద్ద స్టార్ హీరోల పేర్లు ఈ వినిపిస్తున్నప్పటికీ ఎకువగా దిల్ రాజు పవన్ పైనే ఫోకస్ పెట్టాడని ఇన్ సైడ్ టాక్.ఇక రీసెంట్ గా పవన్ ని సినిమా కోసం కలిసాను అని దిల్ రాజు ఓపెన్ గా చెప్పేశాడు కూడా.

ఇదిలా ఉంటే, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కింగ్ నాగార్జున సినిమా ఎప్పుడు వస్తుందనే డిబేట్ కూడా జోరుగా జరుగుతుంది. కారణం టాలీవుడ్‌లో దాదాపు అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్, నాగార్జునతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు మరి.

‘మన్మథుడు’, ‘సంతోషం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాల్లో నాగ్ చేసిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి క్రేజ్ ఉందని తెల్సిందే .అందుకే వీరి కాంబో లో సినిమా వస్తే అదిరిపోతుందని ఆశ పడుతున్నారు నాగ్ ఫ్యాన్స్. చూడాలి మరి ఈ ఇద్దరిలో అనిల్ ఎవరితో జత కడతాడో !

ALSO READ :హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

Tags

Related News

హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

ఇండస్ట్రీలోకి వచ్చాక చెడిపోవాలా? శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !

హీరో సూర్య మూవీకి అక్కడ షాక్.. ‘రామాయణ’ కలెక్షన్స్ ఎంతంటే..?

చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×