E-Paper
Advertisement

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?
Advertisement

Tamannaah Vijay:తమన్నా భాటియా, విజయ్ వర్మ..వీరిద్దరూ ఒకప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌.అయితే కారణాలు ఏమైనా వీరిద్దరి మధ్య బ్రేకప్ అవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ లో మొదలైన వీరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి రెండేళ్ల పాటు జోరుగా సాగిపోయింది.

ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా చేతిలో చేయి వేసుకుని కనిపించడం, సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు కూడా. కానీ 2025 మార్చిలో అనుకోకుండా వీరి బంధానికి ఫుల్ స్టాప్ పడినట్లు బీటౌన్ ఒక్కసారిగా కోడై కూసింది.. అయితే ఈ బ్రేకప్‌పై తమన్నా గానీ, విజయ్ గానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement

అయితే తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే సినిమాలో నటించడం, ఆ షూటింగ్ టైమ్‌లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని బాలీవుడ్ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ముంబైలోని ఓ కేఫ్ దగ్గర విజయ్, ఫాతిమా కలిసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న రూమర్స్‌కు మరింత బలం చేకూరిందని చెప్పాలి. అయితే ఈ పుకార్లపై ఫాతిమా గతంలోనే రియాక్ట్ అవుతూ తన లైఫ్‌లో ప్రస్తుతానికి ఎవరూ లేరని, తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది కూడా. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా భాటియా మాత్రం తన లైఫ్ గురించి పాజిటివ్ థాట్స్ తో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది.ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, లైఫ్ పార్ట్‌నర్ గురించి ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి కూడా . తన జీవితంలోకి రాబోయే వ్యక్తి కోసం తాను ఇప్పటి నుంచే ఒక లైఫ్ పార్టనర్ గా మారేందుకు సిద్ధమవుతున్నానని
చెప్పుకొచ్చింది.

ఆ అదృష్టవంతుడు గత జన్మలో ఏదో పెద్ద పుణ్యం చేసుకుని ఉంటాడని అనుకునేంత గొప్ప పార్ట్‌నర్‌గా తాను ఉండాలనుకుంటున్నట్లు సరదాగా చెప్పుకొచ్చింది.నిజంగా బ్రేకప్ ఇచ్చిన బాధను పట్టించుకోకుండా తమ్మూ ఇలా మాట్లాడటంతో ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

ఇక సినిమాల విషయానికి వస్తే ‘జైలర్’, ‘జీ కర్దా’ వంటి ప్రాజెక్టులతో ఈ మిల్కీ బ్యూటీ అదరగొట్టగా విజయ్ వర్మ ‘డార్లింగ్స్’, ‘మిర్జాపూర్’ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.ఇక ఫాతిమా సనా షేక్ కూడా సరికొత్త కథలతో మెప్పించేందుకు రెడీ అయిపొయింది. మొత్తానికి ఈ ముగ్గురి పర్సనల్ లైఫ్‌పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నా, ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉంటూ ముందుకు సాగిపోతుండటం ఇక్కడ విశేషం !
ALSO READ :ఇండస్ట్రీలోకి వచ్చాక చెడిపోవాలా? శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

ఇండస్ట్రీలోకి వచ్చాక చెడిపోవాలా? శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌.. దివి దీపావళి లుక్ అదిరిపోయిందిగా !

హీరో సూర్య మూవీకి అక్కడ షాక్.. ‘రామాయణ’ కలెక్షన్స్ ఎంతంటే..?

చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

కిర్రాక్ సీత నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది..? నిజంగా గ్రేట్ కదా..

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాక చెన్నైకి వెళ్లిపోయా.. బిందు మాధవి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×