E-Paper
Advertisement

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్
Advertisement

Zebronics Zeb-Thunder: ప్రస్తుత డిజిటల్ యుగంలో మ్యూజిక్ లవర్స్ నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ హెడ్‌ఫోన్స్ ఒక నిత్య జీవిత అవసరంగా మారిపోయాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు లేదా వర్క్ చేసేటప్పుడు బయటి సౌండ్స్ వల్ల డిస్టర్బ్ కాకుండా ఉండటానికి మంచి హెడ్‌ఫోన్ ఉండటం చాలా ముఖ్యం. ఈ కోవకు చెందిందే ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ఈ గాడ్జెట్ యూత్ మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

60 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్:

ఈ హెడ్‌ఫోన్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ లైఫ్. ఇందులో..పవర్ ఫుల్ బ్యాటరీని అందించడం వల్ల ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే ..దాదాపు 60 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అంటే.. మీరు రోజూ వాడినప్పటికీ వారానికి పైగా ఛార్జింగ్ గురించిన టెన్షన్ లేకుండా దీన్ని ఉపయోగించొచ్చు. లాంగ్ జర్నీలు చేసేవా రికి, ఎక్కువ సేపు మ్యూజిక్ వినేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

లేటెస్ట్ కనెక్టివిటీ, గేమింగ్ మోడ్:

Advertisement

ఈ హెడ్‌ఫోన్‌లో లేటెస్ట్ బీటీ v6.0 (బ్లూటూత్ వెర్షన్ 6.0) టెక్నాలజీని అందించారు. దీని వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి డిస్‌కనెక్షన్ సమస్యలు లేకుండా స్టేబుల్ కనెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా.. గేమర్స్ కోసం ప్రత్యేకంగా గేమింగ్ మోడ్ ఇచ్చారు. ఇది తక్కువ లేటెన్సీతో గేమింగ్ ఫీల్ అందిస్తుంది. అలాగే ఒకే సమయంలో.. రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ పేరింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

ఈఎన్సీ టెక్నాలజీ, క్లియర్ కాల్స్:

ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు.. లేదా ఆన్‌లైన్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు చుట్టు పక్కల సౌండ్స్ అడ్డుకోవడానికి ఇందులో ఈఎన్సీ  టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల మీ గొంతు అవతలి వారికి ఎంతో స్పష్టంగా, క్లియర్‌గా వినిపిస్తుంది. వాయిస్ కాల్స్ క్వాలిటీ విషయంలో.. ఈ ధరలో ఇది అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read:  గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

కనెక్టివిటీ ఆప్షన్లు:

కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా..ఈ హెడ్‌ ఫోన్‌ను వివిధ రకాలుగా ఉపయోగించు కోవడానికి వీలుగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటరీ అయిపోయిన.. సందర్భాల్లో ఉపయోగించడానికి ఏయూఎక్స్ కేబుల్ సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ లేదా ఫోన్ అవసరం లేకుండా.. నేరుగా మైక్రో ఎస్‌డీ కార్డ్ ఇన్సర్ట్ చేసి పాటలు వినొచ్చు. ఆన్-ది-ఇయర్ డిజైన్ , కుషన్డ్ ఇయర్ కప్స్ కూడా దీనిలో ఉండటం వల్ల ఎక్కువ సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు.

ధర :

మార్కెట్లో లభిస్తున్న ఇతర బ్రాండ్ల హెడ్‌ ఫోన్లతో పోలిస్తే.. కేవలం రూ. 699 ధరకే లభిస్తున్న ఈ మోడల్ నిజంగా ఒక బిగ్ సేవింగ్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. తక్కువ బడ్జెట్‌లో.. అదిరి పోయే బ్యాటరీ బ్యాకప్, ట్రెండీ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అందుకే ఆఫర్ అయిపోకముందే ఆర్డర్ చేసేయండి.

Related News

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్

చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

జియో బంపరాఫర్.. ఆ ప్లాన్‌పై 84 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×