Sussanne Khan: సుస్సానే ఖాన్..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్యగా మనకి బాగా పరిచయమున్న ఈ వెటరన్ బ్యూటీ ఇపుడు మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.కారణం ఏంటో తెలుసా..హృతిక్‌తో విడాకుల తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన అర్స్లాన్ గోనీతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు మరోసారి మీడియాలో చక్కర్లు కొట్టడమే.
51 ఏళ్ల వయసులోనూ ఎవరు ఏమనుకుంటారు అనే విషయాలని పట్టించుకోకుండా తన సంతోషమే ముఖ్యమంటూ దూసుకుపోతుంది ఈ బీటౌన్ బ్యూటీ.ఈక్రమంలో తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోనీ గురించిన విషయాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు కష్టకాలంలోనూ, జీవితంలో సపోర్ట్ చేసిన తన ప్రియుడే అత్యంత బలమని, అతడి సపోర్ట్ ఎప్పటికీ మరువలేనని ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఒకప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టివ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే . అప్పట్లో వీరి లవ్ మ్యారేజ్ బాలీవుడ్ లో బాగా హైలైట్ అయింది కూడా. ఇక వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు.
మరికారణం ఏంటో కానీ, కొన్నేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో 2014లో ఇద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండ్ తో డైవోర్స్ తీసుకుని సెపరేట్ అయిపోయారు.దీంతో వీరి ఫ్యాన్స్ అప్పట్లో బాగా డిసప్పాయింట్ అయ్యారు కూడా.ఇక హృతిక్‌కు వేరే భామలతో రిలేషన్స్ ఉన్నాయంటూ అప్పట్లో రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టినప్పటికీ వీటిపై ఎవరూ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు.
ఇక డైవోర్స్ తర్వాత హృతిక్ రోషన్ తన సినిమాలతో బిజీ అయిపోగా, సుస్సానే ఖాన్ మాత్రం ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.అలా లైఫ్ లీడ్ చేస్తున్న క్రమంలోనే ఆమె జీవితంలోకి అర్స్లాన్ గోనీ ఎంట్రీ ఇచ్చాడు.
సుస్సానే కంటే వయసులో చిన్నవాడైన అర్స్లాన్‌తో ఆమె ప్రేమలో పడటం, ఇద్దరూ కలిసి పార్టీలకు,టూర్ లకి వెళ్లడం ,వాటికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయిపొయింది.అలా ఏజ్ లో 12 ఏళ్ల చిన్నవాడు అయినప్పటికీ ఏజ్ గ్యాప్ అసలు మ్యాటర్ కాదంటూ జాలీగా గడిపేస్తుంది ఈ జోడీ.
మరో వైపు హృతిక్ రోషన్ కూడా ప్రస్తుతం నటి సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉండగా, సుస్సానే ఖాన్ అర్స్లాన్ గోనీతో తన లైఫ్‌ను లీడ్ చేస్తోంది. చూడాలి గత జ్ఞాపకాలను మర్చిపోయి నచ్చినట్టుగా గడిపేస్తున్న ఈ కపుల్స్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో మరి.
ALSO READ :బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?