Saranya Mohan: ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని.. ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ఆదాయాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో మంచి పాత్రలు రాకపోతే.. ఇండస్ట్రీకి దూరం అవడానికి కూడా వెనకాడరు. అలాంటి వారిలో ఇప్పుడు పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడం.. ఆ తర్వాత పెళ్లి అంటూ ఇండస్ట్రీకి దూరమైపోయింది. పెళ్లి తర్వాత అయినా మళ్లీ ఇండస్ట్రీలో కనిపిస్తుంది అనుకున్నారు కానీ ఆమె మళ్ళీ ఎక్కడ కనిపించలేదు పెళ్లి పిల్లలు అంటూ కుటుంబ జీవితానికే పరిమితమైన ఇన్నాళ్ల తర్వాత సడన్ గా ఒక వీడియోతో దర్శనమిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.
నిజానికి ఈమె ఫేస్ చూస్తే పెద్దగా గుర్తుపట్టరు కానీ.. నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈమె ఎవరో కాదు శరణ్య మోహన్ (Saranya Mohan). అలెప్పీలో పుట్టిన ఈ కేరళ ముద్దుగుమ్మ.. 8 సంవత్సరాల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా మలయాళం లో 3, తమిళ్లో 2 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి.. టీనేజ్ లోకి వచ్చాక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అలా తెలుగులో ‘విలేజ్ లో వినాయకుడు’ లో హీరోయిన్గా నటించిన శరణ్య.. ఆ తర్వాత ‘నాని – భీమిలి కబడ్డీ జట్టు’, ‘ కళ్యాణ్ రామ్ -కత్తి’, ‘ హ్యాపీ హ్యాపీగా ‘ వంటి చిత్రాలలో కూడా కనిపించింది.
అలా 1997 నుంచి 2014 వరకు సినిమాలలో బిజీగా ఉన్న శరణ్యమోహన్ సడన్గా 2015లో తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది . ఈమెకు ఒక అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు . వివాహం, పిల్లలు అంటూ ఇంటికే పరిమితమైన శరణ్య ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తోంది. స్వతహాగా భరతనాట్యం డాన్సర్ అయిన శరణ్య.. తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
also read:రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!
అయితే ఈమెలో అద్భుతమైన సింగర్ కూడా ఉన్నారని తాజాగా బయటపడింది. ప్రస్తుతం జరుగుతున్న గురువాయూర్ చెంభై సంగీతోత్సవంలో కీర్తనలు పాడుతూ అలరించింది. ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండి పోతుందని తన ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టింది. స్వయంగా ఈ వీడియోని శరణ్య అభిమానులతో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నటిగా, డాన్సర్ గా అందరినీ మెప్పించిన ఈమెలో మంచి సింగర్ కూడా ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే తాను ఆలపించిన పాటకు సంబంధించిన వీడియోని శరణ్య షేర్ చేస్తూ..” గురువాయూరప్పన్ గారి దివ్య సన్నిధిలో ‘గురువాయూర్ చెంబై సంగీతోత్సవం 2026’ లో తొలిసారి ప్రదర్శన ఇవ్వడం నిజంగా భగవంతుడి ఆజ్ఞగా భావిస్తున్నాను. నా ప్రియమైన గురువు, డాక్టర్ బి అరుంధతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సంగీత ప్రయాణం అంతటా ఆమె అందించిన మార్గదర్శకత్వానికి, ప్రోత్సాహానికి, ఆశీర్వాదాలు కృతజ్ఞతలు చెబుతున్నాను. కొన్ని సౌండ్ సిస్టం పరిమితుల కారణంగా ఆడియో అంత క్వాలిటీ గా ఉండకపోవచ్చు. కానీ ఈ సంగీతం ఈ ప్రత్యేక క్షణం ఆనందం మీ హృదయాలను చేరుతుందని ఆశిస్తున్నాను” అంటూ శరణ్య తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమెలో ఉన్న ఈ టాలెంట్ చూసి అభిమానులు సైతం నివ్వెరపోతున్నారు.