Singer Jhansi: సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈమె కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక అయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన ఝాన్సీ (Singer Jhansi) మొదటి వారం కెప్టెన్ గా గెలుపు సాధించి తన సత్తా ఏంటో చూపించారు. ఇక టాస్కుల విషయంలో కూడా ఝాన్సీ మంచి పోటీ ఇస్తూ తక్కువ సమయంలోనే మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఝాన్సీ ఆట తీరు చూసిన ప్రేక్షకులు ఈమె ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించారు.
ఇలా సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ హౌస్లో చివరి వరకు కొనసాగుతుందని భావించినప్పటికీ ఊహించని విధంగా ఈమె ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇలా ఎనిమిదవ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం ఎపిసోడ్లో ఝాన్సీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈమె ఏ మాత్రం ఖాళీగా లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ బిగ్ బాస్ రెమ్యూనరేషన్(Bigg Boss Remuneration) గురించి బయట పెట్టేశారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ యాంకర్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఝాన్సీ సమాధానం చెబుతూ.. తాను ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తనకు రాలేదని, కావాలంటే నా అకౌంట్స్ చెక్ చేయండి అంటూ ఈమె తెలిపారు. ఇక బిగ్ బాస్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పారు కానీ ఎప్పుడు వస్తాయో తెలియదని ఝాన్సీ తెలిపారు. తాము బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు రెమ్యూనరేషన్ గురించి అగ్రిమెంట్ చేసుకుంటామని తెలిపారు.
ఇలా బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ముందు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టి వారానికి 70 వేల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నామని ఈమె తెలియజేశారు. సాధారణంగా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వారికి ఇస్తున్న రెమ్యూనరేషన్ గురించి ఎక్కడ బయట పెట్టకూడదు కానీ ఝాన్సీ మాత్రం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలను బయటపెట్టారు. ఇలా వారానికి 70000 అంటే 8 వారాలకు గాను 5.6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వచ్చి నాలుగు వారాలు అవుతున్న ఇప్పటివరకు తనకు ఒక రూపాయి కూడా బిగ్ బాస్ నుంచి రాలేదని ఈమె తెలిపారు.
Also Read: వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..