E-Paper
Advertisement

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!
Advertisement

Naga Chaitanya: నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ (Vrusha Karma )డిసెంబర్ 4వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం  వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేశారు.

నాగార్జున కెరియర్లో 100వ సినిమా..

తాజాగా వృషకర్మ చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే మీడియా వారు నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రశ్నిస్తూ కింగ్ 100 సినిమా(King 100 movie) గురించి కీలక విషయాలను రాబట్టారు. నాగార్జున (nagarjuna) సినీ కెరియర్లో హీరోగా 100వ సినిమా ఆర్. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక రాజకీయ నాయకురాలుగా కనిపించబోతున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ , సుస్మిత భట్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

నాగార్జున సినిమాలో నాగచైతన్య..

Advertisement

ఇక నాగార్జున నటిస్తున్న కింగ్ 100 సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడ స్పష్టత లేదు.. తాజాగా వృషకర్మ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా వారి నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది. కింగ్ 100 సినిమాలో మీరు క్యామియో చేశారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ.. డిసెంబర్ 4వ తేదీ నా వృషకర్మ సినిమా విడుదలవుతుంది ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా అనౌన్స్మెంట్ వస్తుందని నేను దానిపైన మాత్రమే ఫోకస్ పెట్టానని తెలిపారు.

కింగ్100లో చైతన్య …

ఇక కింగ్100 సినిమాలో నేనున్నానా లేదా అనేది కింగ్ చెప్పాలని నాగచైతన్య ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. నాగచైతన్య ఇలా మాట్లాడటంతో ఈయన కింగ్ 100 సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది. ఒకవేళ నటించకపోతే అలాంటిదేమీ లేదని ఈ వార్తలను ఖండించేవారు కానీ, ఈ విషయం గురించి కింగ్ చెప్పాలని చెప్పడంతో కచ్చితంగా నాగచైతన్య కీలకపాత్రలో కనిపించబోతున్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగచైతన్య ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? ఈయన పాత్ర నిడివి ఎంత ఉంటుంది? అఖిల్ కూడా ఇందులో భాగమయ్యారా? కింగ్ 100 మరో మనం కాబోతోందా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

Related News

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

సంకీర్తనలతో భక్తులను అలరిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!

త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు .. గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా?

అలీ రెండో పెళ్లి చేసుకున్నారా? ఇన్నాళ్లకు చేదు నిజం బయట పెట్టిన జుబేదా?

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

Big Stories

Advertisement
×