Venu Madhav: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజాలు తమ అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి దిగ్గజాలు నేడు మన మధ్య లేకపోయినా.. వారు నటించిన సినిమాలు ఎప్పుడు చిరస్మరణీయం. అంతేకాదు వారికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ వారిని మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు దక్కించుకున్న వేణుమాధవ్ (Venu Madhav) కూడా ఒకరు. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. మన మధ్య లేకపోయినా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన తొలి మూవీ సంపాదన ఎంత? అనే విషయం మళ్లీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న వేణుమాధవ్.. ఇండస్ట్రీ లోకి రాకముందు మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాంటి సమయంలో 1995లో దివాకర్ బాబు సన్మాన కార్యక్రమం రవీంద్ర భారతి లో జరిగింది.ఆకృతి సుధాకర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అచ్చిరెడ్డి ,నానాపనేని అన్నారావు , డైరెక్టర్ కృష్ణారెడ్డి వంటి సినీ ప్రముఖులు వచ్చారు. అదే సమయంలో వేణుమాధవ్ తన మిమిక్రీని ప్రదర్శించారు. అయితే ఆయన మిమిక్రీ ని గుర్తించిన నిర్మాతలు ఎన్విఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డైరెక్టర్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో.. నానపనేని అన్నారావు నిర్మాణంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘సంప్రదాయం’ అనే సినిమాలో నటించమని ఆహ్వానించారు.
అయితే అప్పటివరకు స్టేజి షోలు , మిమిక్రీ కార్యక్రమాలు మాత్రమే చేసిన వేణుమాధవ్ కి సినిమా షూటింగ్ ప్రక్రియ, కెమెరా ముందు నటించడం ఎలా వంటి విషయాలపై అవగాహన లేదు. అయితే తాను కెమెరా ముందు నటించలేనేమో అనే భయం.. పైగా అనుభవం లేకపోవడం వల్ల ఈ అవకాశం నుండి ఎలాగైనా తప్పించుకోవాలని చూశారట. అందుకు తగ్గట్టు ఒక ఉపాయాన్ని కూడా ఆలోచించారు. సాధారణంగా మిమిక్రీ కార్యక్రమానికి రూ.250 మాత్రమే తీసుకునే వేణుమాధవ్.. ఆఫర్ ని తిరస్కరించకుండా.. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే వాళ్లే వద్దంటారు కదా అని ఆలోచించి.. కృష్ణా రెడ్డి గారితో రోజుకి రూ.2000 చొప్పున 35 రోజుల షూటింగ్ కి మొత్తం రూ.70,000 ఇస్తేనే నటిస్తాను అని కండిషన్ పెట్టారట . ఆ డిమాండ్ ను కృష్ణారెడ్డి గారు కచ్చితంగా తిరస్కరిస్తారని వేణుమాధవ్ ఊహించి ఈ డిమాండ్ చేశారట.
కానీ వేణుమాధవ్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన కృష్ణారెడ్డి ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. ప్రశాంతంగా.. “అలాగేనండి.. మీరు అడిగినట్లు రూ.70,000 ఇస్తాను” అని చెప్పి అంగీకరించారట అయితే ఈ సమాధానం వేణుమాధవ్ కు ఆశ్చర్యాన్ని కలిగించిందట.వెంటనే ఈ విషయాన్ని తన తల్లితో చెబితే. ఆమె పిచ్చి వేషాలు వేస్తున్నాడని మందలించిందట.
also read: సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్
ఈ విషయాన్ని ఒకానొక సమయంలో వేణుమాధవ్ గుర్తు చేసుకున్నారు కూడా.. అయినప్పటికీ మొదటి అవకాశాన్ని తప్పించుకోవాలని చూస్తూ అడిగిన రెమ్యూనరేషన్ ఆయనకు సినిమాలలో తొలి సంపాదనగా మారింది . ఏది ఏమైనా 250 తో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన ఈయన.. తొలి సినిమాతోనే ఏకంగా 70,000 తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా 1996 జనవరి 14న విడుదలైంది. తనకు సినిమా జీవితాన్ని ఇచ్చిన ఈ రోజును తన పుట్టినరోజుగా అభివర్ణించుకున్నారు కూడా