Mega157 Wraps: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్. తన కెరియర్ లో వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ఇప్పటివరకు ఒక్క డిజాస్టర్ కూడా లేని దర్శకుడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో వస్తున్న 157 వ సినిమా. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను అనిల్ రావిపూడి బయటకు తీస్తాడు అని టాక్ వినిపిస్తుంది. అలానే అనిల్ రావిపూడి స్ట్రెంత్ కూడా కామెడీ అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
మెగాస్టార్ రిటర్న్స్
ఈ సినిమాకి సంబంధించి కేరళ షెడ్యూల్ జరిగిన సంగతి తెలిసిందే. కేరళ షెడ్యూల్లో పడవల పైన మెగాస్టార్ చిరంజీవి, నయనతార కు పెళ్లి జరిగినట్లు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. వెంటనే చిత్ర యూనిట్ కూడా ఇలా వీడియోలు షేర్ చేయకూడదు అని ఒక నోటీస్ కూడా విడుదల చేసింది. ఇక ప్రస్తుతం కేరళాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిపోయింది. అక్కడినుంచి చిత్ర యూనిట్ అంతా కూడా నేడు హైదరాబాద్ కి విచ్చేశారు. ఫ్లైట్లో మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి తో పాటు కొంతమంది ప్రముఖులు హైదరాబాద్ వచ్చేసినట్లు అధికారికంగా ఒక వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
సరిగ్గా హరిహర వీరమల్లు వచ్చారు
ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రేపు అధికారికంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికంటే ముందు ఈ సినిమా ప్రీమియర్స్ నేడు మొదలుకానున్నాయి. సరిగ్గా మెగాస్టార్ హరిహర వీరమల్లు టైంకి హైదరాబాద్ వచ్చేసారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, మెగాస్టార్ కూడా ఈ సినిమాను చూస్తారు. చూసి ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ జెట్ స్పీడ్ లో సేల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను గత రెండు రోజులుగా విపరీతంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా ఈ సినిమా చూపించే ఆలోచనలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలానే మెగాస్టాార్ కి కూడా ఈ సినిమాను చూపించే అవకాశం ఉంది.
“మన శంకరవరప్రసాద్ గారు” ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు✨
Team #Mega157 wraps up the scenic Kerala schedule after shooting a beautiful song and crucial talkie portions ❤️🔥#ChiruAnil Title and First Look soon💥
Megastar @Kchirutweets #Nayanthara… pic.twitter.com/q7sBogJz3P
— Vamsi Kaka (@vamsikaka) July 23, 2025