Mysaa Postponed : సినీ నటి రష్మిక మందన్న ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇలా ఇటీవల రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక త్వరలోనే మైసా సినిమా (Mysaa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని నవంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే దిశగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు..
ఇకపోతే ఈ సినిమా నవంబర్ 27 నుంచి తప్పుకుంటుంది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు అధికారికంగా తెలియజేశారు. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి, టెక్నికల్ గా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అందించడానికే ఈ సినిమా వాయిదా వేసామని చిత్ర నిర్మాతలు తెలిపారు.ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని హామీ ఇస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని తెలియజేయబోతున్నాము అంటూ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.
ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై సరైన స్పష్టత లేదు. డిసెంబర్లో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇక జనవరిలో భాగంగా సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి మైసా కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించగా, అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
We wish to present the world of #MYSAA in its most uncompromised form, delivering the experience it truly deserves.
With this vision in mind, the theatrical release of #MYSAA, originally scheduled for NOVEMBER 27th, has been POSTPONED.
The new release date will be announced… pic.twitter.com/zAL95p2954
— UnFormula Films (@unformulafilms) November 22, 2026
ఇక ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తే మాత్రం రష్మిక (Rashmika)విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఒసేయ్ రాములమ్మ పాటను విడుదల చేయగా ఈ పాటకు ఎంతో అద్భుతమైన ఆదరణ లభించింది. ఇలా సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం భారీ అంచనాలను పెంచేసాయి. ఇలా ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వాయిదా వేసామంటూ చిత్ర నిర్మాతలు తెలియచేయడంతో రష్మిక ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. గుడ్ బై చెప్పిన సుధీర్, నీతూ మాస్టర్!