Kalyani Priyadarshan : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లు ఎప్పుడు వస్తూనే ఉంటారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే అందులో కచ్చితంగా ఎవరో ఒకరు కొత్త యాక్టర్ అనేవాళ్ళు ఉండనే ఉంటున్నారు. ఇటీవల కాలంలో వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్న ముద్దుగుమ్మలకు తెలుగులో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. తెలుగులో వీళ్ళకున్న డిమాండ్ ను బట్టి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలకు అడ్వాన్స్డ్ ఇచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అలాంటి క్రేజీ హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటిస్తూ మంచి పేరును తెచ్చుకుంది. తాజాగా ఇమేజ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లు సినిమాలకన్న ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సినిమాల గురించి అదిరిపోయే అప్డేట్లు ఇస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ గురించి బోలెడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటుగా డబ్బులను కూడా బాగానే సంపాదిస్తూ వస్తున్నారు . ఈమధ్య ఆలిస్టులోకి మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్ కూడా చేరారు. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
క్రేజీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ మలయాళం నుంచి వచ్చిన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.. ఒక్క మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమె చేసిందే మూడు సినిమాలు.. హిట్ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం ఈజీగా గడుపుతుంది. ఈ అమ్మడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం మలయాళంలో చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.. గతంలో ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ కొత్తలోక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాజెక్టుల గురించి త్వరలోనే ఆమె అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఇక తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెెలుస్తోంది మరి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..