E-Paper
Advertisement

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్
Advertisement

Pak Players Trolls Vaibhav:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India A vs Pakistan A, 8th Match) మధ్య ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ప్రతి ఓవర్ లోనూ ఇరు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈ మ్యాచ్ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తోంది. ఇక లేటెస్ట్ గా వైభవ్ సూర్యవంశీని (vaibhav sooryavanshi) 11 పరుగుల వద్ద ఔట్ చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు… రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పెవిలియన్ కు వెళ్లే వైభవ్ సూర్యవంశీ దారుణంగా ర్యాగింగ్ చేశారు. 15 ఏళ్ల వయసులో నీకు క్రికెట్ ఏంట్రా? అన్ని మూసుకొని స్కూల్ కు వెళ్ళు అంటూ హేళ‌న‌ చేస్తూ స్లెడ్జింగ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

వైభ‌వ్ ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

పాకిస్తాన్ తో జరుగుతున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో చేజింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 13 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ (vaibhav sooryavanshi) రెండు బౌండరీలు బాదిన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. 50 ఓవర్ల మ్యాచ్ ను టీ20గా ఆడే ప్రయత్నంలో భాగంగా మహమ్మద్ ఇమ్రాన్ బౌలింగ్ లో అబ్దుల్ సమద్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ తరుణంలో పెవిలియన్ కు వెళ్తున్న వైభవ్ సూర్యవంశీని మరోసారి పాకిస్తాన్ ప్లేయర్లు ర్యాగింగ్ చేశారు. జపాన్ లో జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్ సందర్భంగా ఇలాగే వైభవ్ ను ట్రోల్ చేశారు. ఇవాళ్టి మ్యాచ్ లోనూ అదే తరహాలో సెలబ్రేషన్స్ చేసి.. వివాదానికి తెర లేపారు పాకిస్తాన్ ఆటగాళ్లు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

టీమిండియా ముందు భారీ లక్ష్యం

దోహాలు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జూనియర్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. 49.2 ఓవర్లు వాడిన పాకిస్తాన్ 313 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హసన్ నవాజ్ అద్భుతమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ కు భారీ స్కోరు అందించాడు. ఇక ఈ టార్గెట్ చేదించే క్రమంలో టీమిండియా పోరాడుతోంది. ఆదిలోనే వైభవ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఆయుష్ బదోనిని కూడా కోల్పోయింది. వైభవ్ ఔట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ దాటిగా ఆడుతూ 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 12 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్లు నష్టానికి 63 పరుగులు సాధించింది. మరో 250 పరుగులు చేస్తే విక్టరీ అందుకుంటుంది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

Related News

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

కివీస్ గ‌డ్డ‌పై టీమిండియా స్కోరు 720 దాటిందా? నేను అస్స‌లు నమ్మ‌నంటూ ఇంజ‌మామ్ విమ‌ర్శ‌లు

Big Stories

Advertisement
×