E-Paper
Advertisement

గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. రెండు రోజుల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్!

గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. రెండు రోజుల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్!
Advertisement

Anirudh Kavya:అనిరుధ్ రవిచందర్..పరిచయం అక్కరలేని పేరు.తనదైన సాలిడ్ మ్యూజిక్ తో వరుస మ్యాజిక్స్ చేస్తున్న ఈ క్రేజీ మ్యుజిషియన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని, అది కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో అంటూ వార్తలు బయటికి రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు.

ఇక తాజాగా వీరిద్దరి పెళ్లి వేడుకలు గ్రీస్ లో అంగరంగ వైభవంగా జరుగ బోతున్నట్టు సమాచారం. నవంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారట. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్,రిలేటివ్స్,క్లోజ్ ఫ్రెండ్స్ అంతా గ్రీస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అటెండ్ అవబోతున్నారనే వార్తలు వీరి పెళ్లిపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

Advertisement

ఇక అనిరుధ్ విషయానికి వస్తే తన మ్యూజిక్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు అనడంలో సందేహం లేదు. ‘3’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనిరుధ్.. ఆ తర్వాత వరుసగా స్టార్ మూవీస్ కి పనిచేస్తూ స్టార్ మ్యుజిషియన్ అయిపోయాడు.

ఇక ఈ క్రమంలో ‘కత్తి’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’ వంటి సినిమాలతో నేషనల్ వైడ్ గా తన సత్తా ఏంటో చూపించాడు. ఇక తెలుగులో అజ్ఞాతవాసి సినిమా చేసినప్పటికీ సినిమా బోల్తా కొట్టడంతో స్లో అయిన అనిరుద్ ‘దేవర’ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్‌తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.ముఖ్యంగా అనిరుష్ బీజీఎంలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.

Advertisement

ఇక కావ్య మారన్ విషయానికి వస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును లీడ్ చేస్తుందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ అభిమానుల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది కూడా. అటు అనిరుధ్‌కు సినిమా ఇండస్ట్రీలో, ఇటు కావ్యకు క్రికెట్, బిజినెస్ రంగాల్లో క్రేజ్ ఉండటంలో వీరి పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు స్టాలిన్ ,మరియు ఇతర సెలెబ్రిటీలు పయనం అయ్యే వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి కూడా.

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటేనే అభిమానుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది.అలాంటిది అనిరుధ్, కావ్య మారన్ లాంటి ఇద్దరు సెలబ్రిటీలు ఒక్కటవుతున్నారంటే ఆ హడావుడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక గ్రీస్‌లో పెళ్లి అయిన తర్వాత చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్ 21న జరగనున్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎవరెవరు ఈ ఈవెంట్ కి వచ్చి ఈ జోడీని ఆశీర్వదిస్తారో !

ALSO READ :దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Tags

Related News

రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!

టిల్లూ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఏకంగా సుకుమార్ తో !

ధనుష్‌కు కలిసిరాని బాక్సాఫీస్..200 కోట్ల బడ్జెట్ అవసరమా ?

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?

దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

Big Stories

Advertisement
×