E-Paper
Advertisement

ధనుష్‌కు కలిసిరాని బాక్సాఫీస్..200 కోట్ల బడ్జెట్ అవసరమా ?

ధనుష్‌కు కలిసిరాని బాక్సాఫీస్..200 కోట్ల బడ్జెట్ అవసరమా ?
Advertisement

Dhanush Om:ధనుష్ ..గత కొంతకాలం క్రితం వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ కోలీవుడ్ స్టార్ ఇపుడు వరుస ప్లాపులతో తెగ సతమతమై పోతున్నాడు.ఆ జానర్ ,ఈ జానర్ అంటూ ఏవి ట్రై చేసినా బాక్సాఫీస్ వద్ద హిట్టు ని మాత్రం అందుకోలేకపోతున్నాడు.ఇక ఈ ఫెయిల్యూర్స్ తో ఈ తమిళ తంబికి మార్కెట్ కూడా తగ్గిందన్న టాక్ వినిపిస్తుంది.

ఇదిగో సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏకంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఓం’ అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అయితే అసలే ప్లాపులతో సావాసం చేస్తున్న ధనుష్ కి ఇపుడు ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అన్న కామెంట్లు ఇపుడు నెట్టింటిని చుట్టేస్తున్నాయి.

Advertisement

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందన్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నిజం చెప్పాలంటే ధనుష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌.పైగా ఈ సినిమాకి ధనుష్ కూడా పెట్టుబడి పెట్టడం ఇక్కడ గమనార్హం.

గతంలో ధనుష్ నటించిన ‘అసురన్’, ‘కర్ణన్’, ‘తిరుచిత్రంబలం’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లనే రాబట్టాయి.ఇక తెలుగులో ‘సార్’సినిమా కూడా సాలిడ్ హిట్ నే చూసింది.అయితే ఆ ఆ తర్వాత వచ్చిన ఇడ్లీ కడాయ్ ,కర, సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో వసూల్లని రాబట్టలేకపోయాయి.

Advertisement

అయితే ఈ సినిమాలకి టాక్ బాగానే వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అది రిఫ్లెక్ట్ కాకపోవడం గమనార్హం.దీంతో ఇపుడు ధనుష్ సినిమాల కోసం ఇంత బడ్జెట్ కుమ్మరిస్తే ఆడియన్స్ వస్తారా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి.నిజానికి ఒకప్పుడు స్టార్స్ పేరు చెబితే పొలోమని పరిగెత్తే ఆడియన్స్ ఇపుడు మాత్రం సినిమాలో సత్తా ఉందా ,కథ లో కంటెంట్ లో ఉందా అంటూ భూతద్దం పెట్టి మరీ వెతికేస్తున్నారు .ఇలాంటి సమయంలో రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టడం నిజంగా పెద్ద సాహసమనే చెప్పాలి.

మరో వైపు కోలీవుడ్‌లో ధనుష్‌కు పోటీగా సూర్య,అజిత్ , ప్రదీప్ రంగనాథ్ శివకార్తికేయన్ వంటి వారు సాలిడ్ సక్సెస్ లతో దూసుకొస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ తన పాత క్రేజ్‌ను తిరిగి పొందటం అంటే అంత ఈజీ కాదు.ఒకవేళ ‘ఓం’ గనుక ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వచ్చే సినిమాలపై పడుతుందనడంలో సందేహం లేదు.దీనికి తోడు మేకర్స్ కూడా ధనుష్ పై మరోసారి భారీ బడ్జెట్ అంటే వెనకడుగు వేయడం పక్కా.

మొత్తానికి ధనుష్‌కు ‘ఓం’ సినిమా ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా మారింది. వరుస ప్లాపులనుండి నుంచి బయటపడాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓక్ రేంజ్ లో ఆడాలి.చూడాలి మరి నవంబర్ 20న ఈ తమిళ తంబి ఎలాంటి ఫలితాన్ని రాబడుతాడో !

also read:ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

Tags

Related News

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?

దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

పవన్ తో డివోర్స్ ముందే హింట్ ఇచ్చిన అన్నా.. చివరి పోస్ట్ ఇదేనా?

Big Stories

Advertisement
×