E-Paper
Advertisement

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?
Advertisement

JD chakravarthy:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ డివైన్ యాక్షన్ మూవీ ‘హైందవ’. శతాబ్దాల నాటి దశావతార ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఇందులో కీలక పాత్ర చేస్తున్న విలక్షణ నటుడు జె.డి. చక్రవర్తి, సుమ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని ఫన్నీ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కథ వినకుండానే “చేయను” అన్న జెడి:

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ యాంకర్ సుమతో కలిసి ఒక చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తిని ఈ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయినప్పుడు ఆయన అసలు కథ వినకుండానే “ఈ సినిమా చేయను” అని చెప్పేశారట. ఇక ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ పైనే జెడి అలా ఎందుకు ఫైర్ అయ్యారు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

“నాకు బ్రేక్ ఇద్దామని వచ్చావా?” అంటూ తిట్టిన జెడి :

Advertisement

డైరెక్టర్ లుధీర్ నరేషన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకున్నారు. “నువ్వు ఎవరు? అంతకుముందు ఏం చేశావ్? నేను ఖాళీగా ఉన్నానని నాకు బ్రేక్ ఇద్దామని వచ్చావా?” అంటూ జెడి తనదైన శైలిలో ఫుల్‌గా తిట్టేశారట. ఇక ఆ రూమ్‌లో లైట్స్ ఆఫ్ చేసి, టేబుల్ మీద ఒకే ఒక్క ఫోటో పెట్టి అగ్గిపుల్ల వెలిగించి కథ చెప్పడం స్టార్ట్ చేయడంతో జెడికి ఫుల్ టెన్షన్ పట్టుకుందట.

పది నిమిషాలు టైం అడిగిన డైరెక్టర్ :

అన్ని ప్రశ్నలు వేసినప్పటికీ, జెడి కోపాన్ని చూసి భయపడిపోకుండా డైరెక్టర్ లుధీర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. “సార్, జస్ట్ ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి. 11వ నిమిషంలో నన్ను ఆపేయండి, నేను వెళ్ళిపోతాను. కానీ మిమ్మల్ని మైండ్‌లో పెట్టుకునే ఈ క్యారెక్టర్ రాసుకున్నాను” అని బతిమలాడారట. ఆ తర్వాత జెడి కూడా “సరే వింటాను” అని కూర్చున్నారట.

Advertisement

also read:కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

రెండు గంటలు సాగిన మైండ్ బ్లోయింగ్ నరేషన్:

పది నిమిషాలు అని మొదలుపెట్టిన డైరెక్టర్ నరేషన్, ఏకంగా రెండు గంటల పాటు సాగిందట. కథ వింటున్నంత సేపు జెడిలో ఆశ్చర్యం పెరిగిపోయిందని, చివరకు ఆయన వేసిన ప్రతి ప్రశ్నకు డైరెక్టర్ దగ్గర పర్ఫెక్ట్ రీజన్స్ ఉండటంతో జెడి ఫిదా అయిపోయారట. అంతేకాదు, తన పేరుకు అర్ధం, సినిమా టైటిల్ మీనింగ్ వంటి అన్ని విషయాలపై రీసెర్చ్ చేసి వచ్చిన డైరెక్టర్ డెడికేషన్ చూసి జెడి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ఇక మొదట్లో కోప్పడి, సినిమా చేయనన్న జెడి చక్రవర్తినే ఆ తర్వాత మనసు మార్చుకుని ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం విశేషం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, విభిన్న కథాంశంతో వస్తున్న ‘హైందవ’ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నాయి. ఇక నవంబర్ 27న థియేటర్లలో ఈ మ్యాజిక్ చూడాల్సిందే..

Related News

దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

పవన్ తో డివోర్స్ ముందే హింట్ ఇచ్చిన అన్నా.. చివరి పోస్ట్ ఇదేనా?

ఇరుముడి బ్యూటీ ఇంట పెళ్లి సందడి షురూ..ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పేసిందా?

Big Stories

Advertisement
×