Siddu10 Movie:సిద్ధు జొన్నలగడ్డ ..గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ఎక్కడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలని లైనప్ చేస్తున్నాడు.ఇదిగో ఆ క్రమంలోనే ఇపుడు సరికొత్తగా మరో సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.అది కూడా తన కెరీర్ లో పదో సినిమా కావడం విశేషం.ఇక ఈ సినిమా కోసం ఏకంగా సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసులు రంగంలోకి దిగుతుండటంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు కూడా.
పోస్టర్‌లో ఒకవైపు పెద్ద కత్తి, మరోవైపు శివలింగం కనిపిస్తుండటం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ముఖ్యంగా ఈ పోస్టర్‌కు ఇచ్చిన డార్క్ లుక్, అందులో కనిపిస్తున్న ఆయుధం బట్టి చూస్తే మేకర్స్ ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.
నిజానికి సిద్ధు జొన్నలగడ్డ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘డీజే టిల్లు’నే. అంతకుముందు ‘జోష్’, ‘ఆరెంజ్’సినిమా లలో సైడ్ రోల్స్ వేసిన సిద్దు ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, వంటి సినిమాలతో హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ సినిమాతో ఒక్కసారిగా యూత్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించాడు.
ఇందులో సిద్దు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్.అయితే ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా సిద్దు చేసిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఇక ఆ తర్వాత నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన వసూల్లని రాబట్టలేకపోవడం గమనార్హం.
దీంతో కాస్త స్లో అయ్యడనుకున్న సిద్దు ఇపుడు తాజాగా తన పది సినిమాని ఏకంగా గీతా ఆర్ట్స్ 2,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమా పట్టేయడం విశేషం.ఇక ఈ #Siddu10 అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమా నవంబర్ 11, 2026న ఉదయం 9 గంటల 32 నిమిషాలకు ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో,ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది కాబోలు. చూడాలి మరి భారీ అంచనాలతో మొదలు కాబోతున్న ఈ సినిమా సిద్దుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
Super excited to collaborate with @SukumarWritings @BunnyVasWorks for my next #Siddhu10 🩶
See you all at the Pooja Tomorrow :))@TheBunnyVas @Ashokbandreddi pic.twitter.com/ZdjxbWb9IB
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) November 10, 2026
ALSO READ :ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !