E-Paper
Advertisement

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌
Advertisement

Korean Thriller Series: టైమ్‌ ట్రావెల్‌, మైండ్‌ బెండింగ్‌ సస్పెన్స్‌ కలిపి తెరకెక్కించే సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్స్‌కు ఓటీటీ ఆడియన్స్‌లో ఎప్పుడూ మంచి క్రేజ్‌ ఉంటుంది. మన జీవితంలో జరిగిన కొన్ని తప్పులను గతంలోకి వెళ్ళి సరిచేసుకునే అవకాశం వస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. సరిగ్గా ఇదే క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆల్-టైమ్ బెస్ట్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘365: Repeat the Year’. 2020లో విడుదలైన ఈ సిరీస్‌లో లీ జూన్-హ్యుక్‌, నామ్‌ జి-హ్యున్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ ఓటీటీలో ఉచితంగా చూసే అవకాశం ఉంది. మరి ఈ టైమ్‌ ట్రావెల్‌ కథ ఏమిటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జీ హ్యోంగ్-జూ ఒక పోలీస్‌ డిటెక్టివ్‌. తన సహోద్యోగిని కోల్పోయిన బాధలో ఉన్న అతడికి అనుకోకుండా ఒక ఏడాది వెనక్కి వెళ్లి జీవితాన్ని రీసెట్‌ చేసుకునే అవకాశం వస్తుంది. మరోవైపు షిన్‌ గా-హ్యున్‌ అనే ప్రముఖ వెబ్‌టూన్‌ రచయిత్రి కూడా ప్రమాదం కారణంగా వీల్‌చైర్‌కు పరిమితమవుతుంది. తన పాత జీవితాన్ని తిరిగి పొందాలనే ఆశతో ఆమె కూడా ఈ అవకాశాన్ని అంగీకరిస్తుంది.

Advertisement

వీరితో పాటు మరో ఎనిమిది మందికి కూడా అదే అవకాశం లభిస్తుంది. వీరందరినీ లీ షిన్‌ అనే సైకియాట్రిస్ట్‌ ఒకచోటికి ఆహ్వానించి, తమ జీవితాలను సరిగ్గా ఏడాది వెనక్కి వెళ్లి మళ్లీ ప్రారంభించవచ్చని చెబుతుంది. మొదట్లో అందరూ ఈ అవకాశాన్ని ఒక వరంలా భావిస్తారు. తమ జీవితాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్తగా జీవితం ప్రారంభిస్తారు.

కానీ కొద్దిరోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. గతంలోకి వెళ్లిన వారిలో ఒక్కొక్కరు అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. అసలు ఈ మరణాలకు కారణం ఏమిటి? ఒక ఏడాది వెనక్కి వెళ్లిన తర్వాత కూడా వారి జీవితాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సంఘటనల వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే ప్రశ్నలు మొదలవుతాయి.

Advertisement

దీంతో డిటెక్టివ్‌ హ్యోంగ్-జూ, గా-హ్యున్‌ కలిసి ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తారు. అయితే వారు తెలుసుకునే ప్రతి కొత్త విషయం కథను మరో మలుపు తిప్పుతుంది. టైమ్‌ రీసెట్‌కు ముందు జరిగిన సంఘటనలు, ఆ తర్వాత మారిన పరిణామాలు, ఆ పది మందికి మధ్య ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు ఈ రీసెట్‌ అవకాశం వెనుక ఉన్న రహస్యం ఏమిటన్నది తెలుసుకోవాలంటే సిరీస్‌ను చివరి వరకు చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఊహించని ట్విస్టులు వస్తూనే ఉంటాయి. మిస్టరీ థ్రిల్లర్స్‌, టైమ్‌ ట్రావెల్‌ కథలను ఇష్టపడేవాళ్ళు దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు.

తెలుగులోనూ చూడవచ్చు

ఈ సిరీస్‌లో జీ హ్యోంగ్-జూ పాత్రలో లీ జూన్-హ్యుక్‌, షిన్‌ గా-హ్యున్‌ పాత్రలో నామ్‌ జి-హ్యున్‌ నటించారు. లీ షిన్‌గా కిమ్‌ జీ-సూ, బే జంగ్-టేగా యాంగ్‌ డాంగ్-గన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిమ్‌ క్యుంగ్-హీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ లో మొత్తం 24 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌ నిడివి సుమారు 35 నిమిషాలు ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో Amazon Prime Video Free with Ads ద్వారా ప్రకటనలతో ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ కొరియన్ సిరీస్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: గెస్ట్‌హౌస్‌లో రాత్రి… లవర్స్ లైఫ్‌ను రోడ్‌మీదికి లాగిన ఆగంతకుల గ్యాంగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Related News

కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని టీచర్‌పై అనుమానం… స్కూలుకెళ్ళి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉన్న మిస్టరీ డ్రామా

రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

ఉదయం కాలేజ్ క్లాసెస్, రాత్రి డార్క్ బిజినెస్… ఈ డ్యూయల్ లైఫ్ గేమ్ నెక్స్ట్ లెవెల్ మావా

‘రణబాలి’ నుంచి ‘జైలర్ 2’ వరకు… ఈ వారం ఓటీటీలో రాబోతున్నమోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఇవే

Big Stories

Advertisement
×