E-Paper
Advertisement

రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!

రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!
Advertisement

Yash As Ravana: నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రామాయణ సినిమా(Ramayana Movie) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రశంసలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో చిత్ర బృందంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రావణాసురు(Ravanasura)ని పాత్ర కూడా హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో నటుడు యశ్ (Yash)నటించారు. యష్ పాత్రకు ప్రత్యేకమైన అభినందనలు వస్తున్న సంగతి తెలిసిందే.

రోజుకు 33 కిలోల బరువైన కాస్ట్యూమ్స్..

ఇకపోతే ఈ సినిమాలో యష్ లుక్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా యష్ లుక్స్ కి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ప్రతిరోజు యశ్ రావణ పాత్రలో కనిపించడం కోసం సుమారు 33 కిలోల బరువైన కాస్ట్యూమ్స్ (costume weight)వేసుకునే వారని కాస్ట్యూమ్ డిజైనర్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇక ఆయన ధరించే కిరీటం ఏకంగా 1.8 కిలోల బరువు ఉండేదని తెలిపారు. ఇలా యష్ కాస్ట్యూమ్స్ గురించి ఈ విషయాలు తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ప్రతిరోజు ఇంత బరువైన దుస్తులను నగలను వేసుకొని కూడా యష్ ఎంతో అద్భుతంగా నటించారని ప్రశంసిస్తున్నారు.

ప్రత్యేక డిజైన్లతో నగలు తయారీ..

Advertisement

ఇక రావణాసురుడి పాత్ర కోసం యష్ వేసుకున్న నగలను ఆమ్రపాలి సంస్థ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగల గురించి సదరు సమస్త సీఈఓ మాట్లాడుతూ.. రావణాసురుడు లంకాధిపతి కావడంతో ఆయనని అత్యంత సంపదతో కూడిన రాజుగా చూపించడం కోసం నగలను ప్రత్యేకంగా తయారు చేశామని అదేవిధంగా రావణాసురుడిలో ఉన్నటువంటి విభిన్నమైన కోణాలు ప్రతిబింధించేలా ఈ నగలను తయారు చేశామని ఆమ్రపాలి సంస్థ సీఈఓ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సింహాసనం కోసం కోటి రూపాయలు..

ఇక రామాయణం అనేది ఒక మైథాలజికల్ సినిమా అనే సంగతి అందరికీ తెలిసిందే .ఇందులో ఉపయోగించే నగలు, కాస్ట్యూమ్ కూడా భారీ స్థాయిలో ఉంటాయి. ఇక రావణాసురుడి సింహాసనం కోసం ఏకంగా 24 క్యారెట్ల బంగారు రేకులను ఉపయోగించి తయారు చేసినట్లు ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. ఈ సింహాసనం కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలా అత్యంత భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళి కానుక విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెండు భాగాలు నేచర్ ఏకంగా నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సీన్స్!

Related News

టిల్లూ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఏకంగా సుకుమార్ తో !

ధనుష్‌కు కలిసిరాని బాక్సాఫీస్..200 కోట్ల బడ్జెట్ అవసరమా ?

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?

దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

Big Stories

Advertisement
×