Mythri Movie Makers:ఒకప్పుడు వంద కోట్ల బడ్జెట్ అంటేనే కళ్ళు తేలేసేవారు.కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ వెరీ కామన్ అంటున్నారు.మరీ ముఖ్యంగా ఈ కోట్ల కుమ్మరింతలో మైత్రీ మూవీ మేకర్స్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు.అవును ..వారు ఇపుడు లైనప్ చేసిన సినిమాలన్నీ వంద కోట్ల పైనే ఉన్నాయి .అయితే పెట్టడం వరకు బాగానే ఉంది కాని ఆ పెట్టిన డబ్బంతా రికవరీ అవుతుందా అన్నదే అసలు ప్రశ్న.
ముందుగా మైత్రి మేకర్స్ లైనప్ లో ఉన్న ‘జై హనుమాన్’ సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ ఉంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ . అ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుని హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉండటం కామన్. అయితే ఆ సినిమా సక్సెస్‌ను నమ్ముకుని ఏకంగా రూ.250 కోట్లు పెట్టడం ఎంతవరకు సేఫ్ అనేది మైత్రివారికే తెలియాలి.
ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.నిజానికి ప్రభాస్‌కు పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ ఉండటం అన్నది సినిమాలకి కలిసి వచ్చేదే.కాని అలా అని అన్ని సినిమాలకి బ్రేక్ ఈవెన్ అయి డబ్బులు వస్తాయా అంటే అనుమానమే.కంటెంట్ లో సత్తా లేకపోతే ప్రభాస్ అయినా రికవరీ కష్టమే అని ఈ ఏడు పొంగల్ కి రిలీజ్ అయిన రాజసాబ్ సినిమా ప్రూవ్ చేసింది కూడా. అలాంటప్పుడు రూ.400 కోట్ల బడ్జెట్ ఏ నమ్మకంతో కుమ్మరిస్తున్నారో మేకర్స్ కే తెలియాలి .
మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాకు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ ఉంటుందని వినిపిస్తుంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ కి ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయిందన్నది నిజం.కానీ మళ్ళీ ఆ మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అవుతుందా ..చూడాలి.ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య లో వచ్చిన చాలా మంది దర్శకులు బోల్తా పడ్డవారే.ఇక ఎన్టీఆర్ క్రేజ్‌ను నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్ పెట్టారు అనుకుంటే వార్ 2 ఏమైందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.సో ..బాక్సాఫీస్ వద్ద క్రేజ్, అంచనాలు ఏవీ పని చేయవన్న మాట.
ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 సినిమాకు కూడా సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం. రంగస్థలం తర్వాత ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పక్కర్లేదు. కానీ చరణ్ గత సినిమా పెద్ది బాక్సాఫీస్ వద్ద ఏ పాటి సౌండ్ చేశాడో చెప్పక్కర్లేదు.మరి వాటిని మైత్రి మేకర్స్ పరిగణలోకి తీసుకున్నారో లేదో. అంచనాలు అందుకుంటే ఓకే లేదంటే మాత్రం చిక్కులు తప్పవు.
ఇక అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న AA23 అయితే ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.పుష్ప 2తో బన్నీ మార్కెట్ భారీగా పెరిగింది. కానీ పుష్ప 2 లాగా అన్ని సినిమాలు వర్క్ అవుట్ అవుతాయా అంటే చెప్పలేము. గతంలో ఇలాగే భారీగా కోట్లు కుమ్మరించి కళ్ళు తెలేసినవాళ్ళు ఎందఱో.రూ.600 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారంటే వాళ్ళ టార్గెట్ ఈజీగా వెయ్యి కోట్లు ఉండాలి.చూడాలి మరి ఏ మేరకు మైత్రి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో.
మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వరుసగా వందల కోట్లతో సినిమాలు ప్లాన్ చేస్తుండటం ఒక రకంగా ఇండస్ట్రీకి బూస్టప్ ఇస్తున్నప్పటికీ తేడా కొడితే ఏంటి అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.చూడాలి మరి ..వందల కోట్ల బడ్జెట్ ని ఎలా రికవరీ చేస్తారో !
ALSO READ :జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!