Windies vs Australia T20 series: మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ జట్టును వైట్ వాష్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. అనంతరం పొట్టి ఫార్మాట్ లోను సత్తా చాటింది. ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ {Windies vs Australia T20 series} జూలై 20 ఆదివారం నుండి ప్రారంభమైంది. అటు టెస్ట్, ఇటు టి-20 సిరీస్ లను ఆస్ట్రేలియా అద్భుతమైన విజయంతో ముగించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ని 5 – 0 తో గెలుచుకుంది.
Also Read: BCCI: ఇద్దరు కోచ్ లపై బీసీసీఐ సంచలన నిర్ణయం.. కొత్త బౌలింగ్ కోచ్ అతడే..?
వెస్టిండీస్ వైట్ వాష్:
ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ని ఆస్ట్రేలియా వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి. మరోవైపు వెస్టిండీస్ కూడా ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో వైట్ వాష్ కి గురికావడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన తొలి జట్టు భారత్ కావడం విశేషం. 2020 లో న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ ని భారత జట్టు వైట్ వాష్ చేసింది. ఇక ఈ ఘనత సాధించిన రెండవ జట్టుగా ఇప్పుడు ఆస్ట్రేలియా నిలిచింది. శనివారం రోజు జరిగిన నాలుగవ టి-20లో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన వెస్టిండీస్.. ఆఖరి టీ-20 లో కూడా ఓటమిని చవిచూసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టిడి చేయడంలో విఫలం:
చివరి టీ-20 లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వెస్టిండీస్ బ్యాటర్లలో విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హిట్ మైర్ 52, షెర్ఫెన్ రూథర్ఫర్డ్ 35, హోల్డర్ 20 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షూయిస్ 3, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టారు. అలాగే ఆరోన్ హర్డి, సీన్ అబాట్, మ్యాక్స్ వెల్, ఆడమ్ జంపా లు చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: RJ Mahvash: చాహల్ ని చీటింగ్ చేసిన ఆర్జే మహ్వాష్..? ఒకరి భర్తను దొంగిలించడం నేరం అంటూ..!
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 17 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ ఓవెన్ 37, గ్రీన్ 32, హర్డీ 28*, డేవిడ్ 30 పరుగులతో రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లు మరోసారి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టిడి చేయడంలో విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకేల్ హోసిన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఐదవ టి-20 లో ఓటమితో అటు టెస్ట్, ఇటు టి-20 సిరీస్ లలో వెస్టిండీస్ వైట్ వాష్ అయ్యింది.