JE Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ లేదా డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, వయస్సు, దరఖాస్తు విధానం, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: రేపే లాస్ట్ డేట్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాదికి గానూ భారీగా జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఓ, సీడబ్ల్యూసీ, సీపీడబ్ల్యూడీ, ఎంఈఎస్, ఎన్‌టీఆర్ఓ, జల్ శక్తి శాఖల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జులై 27వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1340
ఇందులో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: డిప్లొమా లేదా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విబాగాల్లో పాసై ఉండాలి. కొన్ని పోస్టులకు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల మించి ఉండరాదు. కొన్ని పోస్టులకు 32 ఏళ్లు వయస్సు మించిరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థుల వయస్సు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థుల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. రూ.35,400 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ లేదా మై ఎస్ఎస్‌సీ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 21
ఫీజు చెల్లింపుకు చివరి తేది: జులై 22
పేపర్ 1 ఎగ్జామ్ డేట్: 2025 అక్టోబర్ 27 నుంచి 31
పేపర్ 2 ఎగ్జామ్ డేట్: 2026 జనవరి, ఫిబ్రవరి
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
వెకెన్సీల సంఖ్య: 1340
దరఖాస్తుకు చివరి తేది: జులై 21
ALSO READ: Intelligence Bureau: సూపర్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..
ALSO READ: BDL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ.38,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు