BigTV English

Annapurna Studios @ 50 years: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత

Annapurna Studios @ 50 years: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత


50 Years of Annapurna Studio: భారత చలన చిత్రరంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ తెలుగు సినీ ఇండస్ట్రీ. ప్రస్తుతం ఇండియన్మూవీ ఇండస్ట్రీ డెవలప్మెంట్లో టాలీవుడ్కీలక పాత్ర పోషిస్తోంది. భారీ బడ్జెట్‌, పాన్ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తూ బాక్సాఫీసు వద్ద వేల కోట్ల కలెక్షన్స్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఇండియన్మూవీ ఇండస్ట్రీలో టాలీవుడ్దే టాప్ప్లేస్అనడంలో సందేహం లేదు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీకి అన్నపూర్ణ స్టూడియోతోనే మొదట రాయి పడిందనే విషయం తెలుసా?. ప్రత్యేక తెలుగు సినీ పరిశ్రమ ఉండాలనే ఉద్దేశంతో ఏఎన్ఆర్ 1950లో అన్నపూర్ణ స్టూడియోని స్థాపించారు. ఏడాదితో అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది సందర్బంగా ఈ స్డూడియోలు విశేషాలు, దీని వెనక ఉన్న ఏఎన్ఆర్ కృషిని ఓసారి గుర్తు చేసుకుందాం!

సౌత్ ఇండస్ట్రీ కేరాఫ్ గా మద్రాస్


ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే నాటి మద్రాసు రాష్ట్రం.. ప్రస్తుతం చెన్నై. అప్పుడు ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలు మాత్రమే ఉండేవి. తెలుగు సినిమాలన్ని కూడా అక్కడే రూపొందేవి. స్టూడియోలు, యాక్టింగ్కోర్స్లు కూడా చెన్నైలోనే ఉండేవి. నటీనటులు కావాలనుకునేవారు ఆంధ్ర నుంచి చెన్నైకి వెళ్లేవారు. అలా చెన్నై వెళ్లి స్టార్ హీరోలుగా మారారు. నటులు అవ్వాలంటే  మనది కానీ రాష్ట్రం వెళ్లి అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోహీరోయిన్లు అయిన మన తెలుగు వాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో మొదట వినిపంచే పేర్లు ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌లవే. వారివల్లే తెలుగువారికి అవకాశాలు దొరకడం మొదలయ్యాయి.  వారు హీరోలు వెలుగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్స్వచ్చాయి

ఏఎన్ఆర్ కృషి ఫలితమే అన్నపూర్ణ స్డూడియో

ఇక ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాడ్డాక.. తెలుగు వాళ్లకు కూడా ప్రత్యేకమైన సినీ పరిశ్రమ ఉండాలని ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్లు ఆలోచించి హైదరాబాద్లో తెలుగు సినీపరిశ్రమ స్థాపనకు కృషి చేశారుసినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వర్రావు అందించిన సేవలను గుర్తిస్తు ఆనాటి ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని 22 ఏకరాల భూమిని కేటాయించారు. తెలుగు సినీ పరిశ్రమకు తన సొంత భూమిలోనే పునాది పడాలనే ఉద్దేశంలో అన్నపూర్ణ స్డూడియోను స్థాపించారు. అలా 1975 ఆగష్టు 13 అన్నపూర్ణ స్డూడియోను స్థాపినకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే అక్కడ ఇల్లు, స్టూడియో నిర్మించారు. 1976 జనవరి 14 అనాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్అలీ అహ్మద్అధికారంగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.

బంజరు భూమిని బ్రాండ్ సిటీగా..

ఇప్పుడు మహానగరంగా ఉన్న హైదరాబాద్ఒకప్పుడు కొండలు, గుట్టలతో ఉండేదనే విషయం తెలిసిందేప్రస్తుతం అత్యంత కాస్లీ ఏరియాగా ఉన్న బంజారాహిల్స్ఒకప్పుడు వట్టి బంజర భూమి. అప్పుడే ఏపీ ప్రభుత్వం బంజర భూమిని ఏఎన్ఆర్కు కేటాయించింది. అన్నపూర్ణ స్టూడియో స్థాపనకు ముందు ఇదంత కొండలు, గుట్టలతో ఉండేది. రోడ్లు లేవు, నిర్మాణాలు లేవు. అలాంటి భూమినిలో అన్నపూర్ణ స్డూడియోకు పునాది వేశారు. చెట్లు, కొండలు తొలగించి విశాలవంతమై భూమిగా మార్చి అక్కడ స్డూడియో నిర్మాణాన్ని చేపట్టారు. అలా జనవరి 14, 1976న బంజారాహిల్స్లో అన్నపూర్ణ స్టూడియో వెలిసింది. అప్పుడు అక్కడ ఏలాంటి ఇళ్లు, నిర్మాణాలు కూడా లేవు. స్టూడియోకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా లేవు. అలాంటి ప్లేస్లో స్టూడియో నిర్మించిన ఏఎన్ఆర్సినీ ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకువచ్చారు. అలా బంజర్ భూమిని బ్రాండ్ సిటీగా మార్చారు. 

తర్వాత మెల్లిమెల్లిగా దానిని డెవలప్చేస్తూ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్క్రియేటివ్ప్లేస్గా అన్నపూర్ణ స్టూడియోని నిలబెట్టారు స్టూడియో స్థాపన తర్వాత బంజరు భూమి మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వడం ప్రారంభమైంది. అలా జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణ నగర్లు వెలిశాయి. ప్రస్తుతం దేశంలోని సినీరంగంలోనే అత్యాధునిక వసతులు ఉన్న స్టూడియో ఇది. ప్రస్తుతం ఇక్కడ సీరియల్స్నుంచి సినిమాల వరకు ఎన్నో చిత్రాల షూటింగ్స్జరుగుతుంటాయి. అంతేకాదు బహిరంగ సెట్స్‌, బహుళ షూటింగ్అంతస్తులు, పోస్ట్‌-ప్రొడక్షన్సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు నటీనటులకు శిక్షన ఇచ్చేందుకు అన్నపూర్ణ కాలేజ్ఆఫ్ఫిల్మ్అండ్మీడియాను స్థాపించారు. నటన, దర్శకత్వం, సినిమాటోగ్రపీ, ఎడిటింగ్‌, సౌండ్డిజైన్వరకు శిక్షణ ఇస్తున్నారు. అలా ఏఎన్ఆర్ కృషి ఫలితంగా హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో వెలిసి.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారింది.

Related News

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Kantara Chapter 1 Event: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్, ఫ్యాన్స్ లో జోష్ నింపిన ప్రొడ్యూసర్

Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్

Niharika: కుటుంబానికి దూరంగా నిహారిక.. వాళ్ళే నా ప్రపంచం అంటూ!

Big Stories

×