Foods For Eye Health: కళ్లు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన అవయవాలలో ఒకటి. ఆధునిక జీవనశైలి, గంటల తరబడి స్క్రీన్‌లను చూడటం, కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కంటి చూపు మందగించడం, అలసట, పొడిబారడం వంటి సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణంగా మారాయి. అందుకే మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కళ్ళకు మేలు చేసే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు:
బచ్చలికూర, మెంతి, పాలకూర వంటి ఆకుకూరలలో లూటిన్ , జియాక్సాంథిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనా , కటకాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి వయసుతో వచ్చే దృష్టి లోపాలను తగ్గిస్తాయి. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు ఆకుకూరలు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
క్యారెట్లు:
క్యారెట్లు కంటి ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలుసు. వాటిలోని బీటా-కెరోటిన్ అనే విటమిన్-ఎ శరీరంలోకి వెళ్ళాక రెటినాల్‌గా మారుతుంది. ఈ రెటినాల్ దృష్టిని మెరుగుపరచడానికి, ముఖ్యంగా రాత్రిపూట స్పష్టంగా చూడటానికి చాలా అవసరం. క్యారెట్ జ్యూస్ లేదా సలాడ్‌గా తీసుకోవడం మంచిది. లేదా జ్యూస్ చేసుకుని తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
నారింజ, నిమ్మ, పుల్లని పండ్లు:
విటమిన్-సి అనేది కళ్ళలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. నారింజ, నిమ్మ, బత్తాయి , పుల్లని పండ్లలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కంటి శుక్లాలను నివారించడంలో ఉపయోగ పడుతుంది. అంతే కాకండా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గుడ్లు:
గుడ్లలో విటమిన్-ఎ, లూటిన్, జియాక్సాంథిన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళలో ఉండే మచ్చలను ఆరోగ్యంగా ఉంచుతాయి . అంతే కాకుండా నీలి కాంతి నుంచి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. ఉదయం పూట ప్రతి రోజు ఒక ఉడికించిన గుడ్డు తినడం మంచిది.
Also Read: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !
నట్స్, సీడ్స్:
బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి వాటిలో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కంటి కణాలను రక్షించి, కంటి పొడి బారడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. రోజుకు గుప్పెడు నట్స్ లేదా ఒక చెంచా సీడ్స్ తినడం మంచిది. ఫలితంగా కంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు.
చేపలు:
సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి రెటీనా ఆరోగ్యానికి చాలా అవసరం. కంటి పొడిబారడం సమస్యను తగ్గించడంలో కూడా ఇవి చాలా బాగా సహాయ పడతాయి. వారానికి ఒకసారి చేపలు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపలలోని పోషకాలు కంటి సంబంధిత సమస్యలు రాకుండాచేస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి అవసరం అయిన పోషకాలను కూడా అందిస్తాయి.