Tollywood Star Couple: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కూడా బిజీగా గడుపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా నిన్న అర్ధరాత్రి సమయంలో తన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)తో విడిపోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక బంధానికి ముగింపు చెప్పినట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా వీరి విడాకుల వార్తల నుంచి అభిమానులు బయటపడకముందే మరొక న్యూస్ వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా బాటలోనే మరొక టాలీవుడ్ స్టార్ కపుల్స్ కూడా విడాకులకు సిద్ధమైనట్టు సమాచారం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అయితే ఇప్పటికే వారు విడిపోవాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా విడాకులకు సంబంధించిన ఫార్మలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ తమ విడాకుల వార్తలను అధికారికంగా తెలియజేస్తారా లేదంటే సైలెంట్ గానే విడాకులు తీసుకొని వేరుగా ఉంటారా అనేది తెలియదు కానీ మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఇక ఆ జంట ఎవరు ఏంటి అనే విషయాలను బయట పెట్టకపోయినప్పటికీ, సదరు నటి మాత్రం ఈ ఏడాది ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు అయితే తన విడాకుల విషయాన్ని ఈమె అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరి వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించకుండా విడిపోతున్నారా లేదంటే తమ విడాకుల విషయాన్ని తెలియజేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం మూడోసారి ఇలా విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విడాకుల వార్తలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకి విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రేణు దేశాయ్ తో ఏడడుగులు నడిచారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అయిన తర్వాత పవన్ రేణు నుంచి విడాకులు తీసుకొని తిరిగి అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇలా 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట ముగింపు పలకడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
Also Read: పవన్ తో డివోర్స్ ముందే హింట్ ఇచ్చిన అన్నా.. చివరి పోస్ట్ ఇదేనా?