E-Paper
Advertisement

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌
Advertisement

The Good Lawyer OTT: కోర్ట్‌రూమ్ డ్రామా సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ లో ఎప్పుడూ ఒక పర్మనెంట్ క్రేజ్ ఉంటుంది. లాయర్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, సాక్ష్యాల వేట, ఇంటెలిజెంట్ వాదనలు ప్రేక్షకులను లాక్ చేస్తాయి. ఇప్పుడు లాంటి కంటెంట్ తో గ్లోబల్ వైడ్‌గా ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది ‘The Good Lawyer’ అనే సరికొత్త లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. లారెంట్‌ లాఫిట్‌, ఆంథోనీ బాజోన్‌, మెలానీ లారెంట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ట్రిస్టాన్‌ సెగ్వెలా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా నవంబర్‌ 9  నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో, ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

లియోనార్డ్‌ లాండ్రీ (లారెంట్‌ లాఫిట్‌) ఒక తెలివైన క్రిమినల్‌ డిఫెన్స్‌ లాయర్‌. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా తన వాదనలతో మలుపు తిప్పగలడనే పేరున్న అతడికి మద్యం, కొకైన్‌ వంటి వ్యసనాలు కూడా ఉంటాయి. ఈ అలవాట్ల కారణంగా ఒకరోజు కోర్టులో వాదిస్తున్న సమయంలోనే అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతడి పరిస్థితి అందరి ముందు బయటపడటంతో రిహాబిలిటేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది.

Advertisement

అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లియోనార్డ్‌కు మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. తన లాయర్‌ లైసెన్స్‌, కెరీర్‌ నిలబెట్టుకోవాలంటే తనపై జరగబోయే విచారణను ఎదుర్కోవాలి. అందుకు అతడి దగ్గర ఉన్న సమయం కేవలం వారం రోజులు మాత్రమే. ఈ సమయంలో నోయే (ఆంథోనీ బాజోన్‌) అనే యువ ఇంటర్న్‌ అతడికి సహాయం చేయడానికి ముందుకొస్తాడు.

ఇదే సమయంలో ఒక పెద్ద ఎనర్జీ కంపెనీకి సంబంధించిన కీలకమైన కేసులోనూ లియోనార్డ్‌ జోక్యం చేసుకుంటాడు. ఆ కంపెనీపై ఆఫ్రికాలోని సాయుధ ఉగ్రవాద గ్రూపులకు సహకరించిందనే ఆరోపణలు ఉంటాయి. ఈ కేసులో కీలక సాక్షి వాంగ్మూలం, దాని వెనుక ఉన్న రాజకీయ, న్యాయపరమైన చిక్కులు కథను మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. తన వ్యక్తిగత కేసును ఎదుర్కొంటూనే, ఈ హైప్రొఫైల్‌ కేసులోనూ వ్యూహాలు రచించాల్సి వస్తుంది.

Advertisement

ఒకవైపు వ్యసనాల నుంచి బయటపడే ప్రయత్నం.. మరోవైపు తన కెరీర్‌ను కాపాడుకోవాలనే తపన.. ఇంకోవైపు న్యాయస్థానంలో ఎదురయ్యే సవాళ్లు! ఈ పరిస్థితుల మధ్య లియోనార్డ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? తన తప్పుల నుంచి బయటపడి మళ్లీ లాయర్‌గా నిలబడగలడా? అనేదే ఈ సినిమా ఆసక్తికరమైన అంశం. కోర్టు వాదనలు, వ్యక్తిగత సంఘర్షణలు, నైతిక సందిగ్ధతలతో కథ ముందుకు సాగుతుంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా సాగుతూ ఆడియన్స్ ని ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా లాక్ చేస్తుంది. లీగల్ యాక్షన్ అండ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు ఈ మాస్టర్ పీస్ ని అస్సలు మిస్ అవ్వకండి.

 తెలుగులోనే స్ట్రీమింగ్ 

ఈ చిత్రంలో లారెంట్‌ లాఫిట్‌ లియోనార్డ్‌ లాండ్రీగా, ఆంథోనీ బాజోన్‌ నోయేగా, మెలానీ లారెంట్‌ ఐరిస్‌ సెయింట్‌-డిడియర్‌గా నటించారు. సుమారు 1 గంట 54 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు ట్రిస్టాన్‌ సెగ్వెలా దర్శకత్వం వహించారు. ఈ లీగల్ థ్రిల్లర్ నవంబర్‌ 9 నుంచి Netflixలో ఫ్రెంచ్‌ ఒరిజినల్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌ ఆడియోల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

Read Also: గెస్ట్‌హౌస్‌లో రాత్రి… లవర్స్ లైఫ్‌ను రోడ్‌మీదికి లాగిన ఆగంతకుల గ్యాంగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

.

Tags

Related News

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

ఉదయం కాలేజ్ క్లాసెస్, రాత్రి డార్క్ బిజినెస్… ఈ డ్యూయల్ లైఫ్ గేమ్ నెక్స్ట్ లెవెల్ మావా

‘రణబాలి’ నుంచి ‘జైలర్ 2’ వరకు… ఈ వారం ఓటీటీలో రాబోతున్నమోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఇవే

అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మీ’ ..స్ట్రీమింగ్ డేట్ లాక్!

150 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణాన్ని కూల్చేయాలని ప్లాన్… సిస్టమ్‌పై సామాన్యుడి దండయాత్ర

తాతల నాటి రెస్టారెంట్ తెరవడానికి స్టార్ హీరోయిన్ పడ్డ పాట్లు… రియాలిటీ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×