E-Paper
Advertisement

రెవెన్యూ శాఖ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫైర్!

రెవెన్యూ శాఖ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫైర్!
Advertisement

Human Rights: తెలంగాణ ప్రభత్వానికి మానవ హక్కుల కమిషన్ రెండు కీలక కేసుల్లో సిఫార్సులు చేసింది. గత ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భూభారతి ఆపరేటర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని రెవెన్యూ శాఖకు మానవ హక్కుల కమీషన్ సూచనలు చేసింది. మరోవైపు గోల్కొండ పోలీసులపై అక్రమ నిర్బంధం, దాడి ఆరోపణలపై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మానవ హక్కలు సంఘం ఆదేశించింది.

కమిషన్ కీలక సిఫార్సులు

భూభారతి ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని TGHRC సిఫార్సుతో పాటు.. ఏడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న భూభారతి ఆపరేటర్లు వేతనాల ఆలస్యం జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకోసం రెవెన్యూ శాఖ కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల అక్రమ నిర్బంధం..

Advertisement

గోల్కొండ పోలీసులపై దాడి, అక్రమ నిర్బంధం ఆరోపణల విషయంలో ఫిర్యాదుదారుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్య రికార్డుల్లో నమోదు చేసారు. దీంతో పోలీసుల వివరణపై మానవ హక్కుల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిర్యాదు దారుడి పై కేసు ప్రతీకార చర్యగా నమోదైనట్లు కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ సీపీకి సిఫార్సు చేసింది. ఆరు నెలల్లోగా చర్యలపై నివేదిక ఇవ్వాలని.. మానవ హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 18 కింద రెండు కీలక సిఫార్సులను మానవ హక్కుల సంఘం క్లారిటీ ఇచ్చింది.

Also Read: కిర్లంపూడి పీఎస్‌లో అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ విడాకులపై ఎమన్నారంటే?

Tags

Related News

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి వీసీ జానయ్య లేఖ

హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్లు అరెస్ట్!

రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన!

సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!

బిర్యానీ ఆలస్యమైందని ప్రశ్నిస్తే.. కత్తులతో దాడి చేసిన యాజమాన్యం!

భాగ్యనగరంలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. 15 నుంచి గోదావరి జలాలు! శరవేగంగా సాగుతున్న పనులు

Big Stories

Advertisement
×