E-Paper
Advertisement

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?
Advertisement

Anna lezhneva:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో 13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు ప్రకటించారు. పరస్పర అంగీకారం, గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ తల్లిదండ్రులుగా ,మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. తమ పిల్లల సంతోషం, భవిష్యత్తు సంక్షేమమే తమకు ఎప్పటికీ ముఖ్యమని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అన్నా లెజినోవా బ్యాక్ గ్రౌండ్, ఆమె ఆస్తుల వివరాలు, వ్యాపార సామ్రాజ్యం సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది.

ఎవరీ అన్నా లెజినోవా?

రష్యా కు చెందిన ప్రముఖ మోడల్. నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 1980లో రష్యాలో జన్మించారు. 2011లో విడుదలైన తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా.. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత 2013లో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. ఇక వీరి బంధానికి గుర్తుగా 2015లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు కూడా జన్మించారు.

Advertisement

also read:శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

అన్నా లెజినోవా వ్యాపార సామ్రాజ్యం..

ఈమె వ్యాపార సామ్రాజ్యం విషయానికి వస్తే.. 2024లో సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టా పొందిన ఈమె.. హాస్పిటాలిటీ రంగంలో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సింగపూర్లో కొన్ని హోటల్స్ ని కూడా ఈమె కలిగి ఉంది. సుమారుగా రూ.1800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విద్యారంగంలో కూడా ఈమె పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. నిజానికి అన్నా లెజినోవా పుట్టుకతోనే కోటీశ్వరులు. ఈమె తండ్రి రష్యాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని సమాచారం. ఏది ఏమైనా అన్న లెజినోవా బ్యాక్ గ్రౌండ్, ఆమె ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ఇటు పవన్ కళ్యాణ్ ఆస్తుల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబ ఆస్తులు విలువ సుమారుగా రూ.164.5 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య అన్నా పేరు మీద సుమారుగా కోటి విలువైన ఆస్తితో పాటు రూ.46 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ లెక్కను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కంటే కూడా అన్నా లెజినోవా ఆస్తుల వివరాలు చాలా రేట్లు అధికం అనేది చెప్పాలి. ఏది ఏమైనా అటు ఆస్తుల పరంగా ఇటు వ్యక్తిగతంగా మంచి పేరు దక్కించికున్న వీరిద్దరూ.. ఇప్పుడు సడన్గా వైవాహిక బంధానికి స్వస్తి పలకడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయంగా ఇటు సినీ వర్గాలలో కూడా వీరి విడాకుల వార్త సంచలనంగా మారింది.

Related News

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

పవన్ తో డివోర్స్ ముందే హింట్ ఇచ్చిన అన్నా.. చివరి పోస్ట్ ఇదేనా?

ఇరుముడి బ్యూటీ ఇంట పెళ్లి సందడి షురూ..ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పేసిందా?

సాటి మనుషుల పట్ల దయతో ఉండండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

పవన్ కళ్యాణ్ – అన్నా విడాకుల వెనుక అసలు కారణం ఇదేనా?

తరుణ్ భాస్కర్ తో ఈషా ఇంట దివాళీ వేడుకలు.. ఇంకెన్నాళ్ళు?

Big Stories

Advertisement
×