Jim Jim Tara Singer: సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జిమ్ జిమ్ తార ఫీవర్ ఉందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీదేవి అనే ఒక యూట్యూబర్ సరదాగా ఈ పాట పాడుతూ రీల్ చేశారు. అయితే ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు. ఇక ఈ పాటకు డీజే రీమిక్స్ జోడించి పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇలా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు కూడా జిమ్ జిమ్ తార(Jim Jim Tara) పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ పాట ఫేమస్ కావడంతో ఎంతోమంది ఇప్పటికే సింగర్ లక్ష్మీదేవి(Lakshmi Devi)ని కలిసి ఆమెతో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా రాత్రికి రాత్రే జిమ్ జిమ్ తారా పాటతో ఫేమస్ అయిన సింగర్ లక్ష్మీదేవి ఏకంగా సినిమాలో పాటలు పాడే అవకాశాన్ని కూడా అందుకున్నారు. జిమ్ జిమ్ తార పాటను పర్ణశాల(Parnashala) సినిమాలో ఉంచామని అయితే ఈ పాట విడుదల చేయకముందే యూట్యూబర్ లక్ష్మీదేవి పాడటంతో ఈ పాట ఫేమస్ అయిందని పర్ణశాల చిత్ర బృందం సైతం ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపోతే తాజాగా పర్ణశాల చిత్ర బృందం ఈ సినిమాలోని జిమ్ జిమ్ తార పాటను స్వయంగా లక్ష్మీదేవితో పాడించారు.
ఇలా ఈ పాటతో ఈమె ఫేమస్ అవ్వడమే కాకుండా సినిమాలో కూడా పాట పాడే అవకాశాన్ని అందుకోవడం విశేషం. ఇక ఈ పాటను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పర్ణశాల చిత్ర బృందం తెలియచేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వీడియోలు పెడుతున్న గోకుల లక్ష్మి సరదాగా జిమ్ జిమ్ తార పాట పాడుతూ రీల్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఇక ఈమె ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, అనంతపురం జిల్లా వాసి అని తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఉన్నారు.
ఇలాంటి వారిలో గోకుల లక్ష్మి కూడా ఒకరు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలక్షేపం కోసం సరదాగా ఇలా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నటువంటి ఈమె ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక పర్ణశాల సినిమా విషయానికి వస్తే.. జి. భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్, కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. కార్తికేయ, అనుక్రిత జంటగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి బజ్ లేకపోయినప్పటికీ జిమ్ జిమ్ తార పాటతో మాత్రం ఈ సినిమాకు కావలసినంత హైప్ పెరిగిపోయిందని చెప్పాలి. ఈ సినిమాకు ఇలాంటి బజ్ రావడానికి కారణం లక్ష్మీ ఆంటీ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాలోని జిమ్ జిమ్ తార పాటను ఆమె చేత మేకర్స్ పాడించారు.
Insta లో ఒక ఊపు ఊపేస్తున్న Jim Jim Tara సాంగ్ సినిమాలో వచ్చేస్తుంది.
ఆవిడ తోనే పాడించి రికార్డ్ చేశారు.4
పర్ణశాల సినిమా నుంచి First Single out today! pic.twitter.com/zQLKFLx5H4
— Rajesh Manne (@rajeshmanne1) October 12, 2026
Also Read: ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?