E-Paper
Advertisement

నీచంగా ప్రవర్తించాడు.. పీరియడ్స్ విషయంలో సిగ్గుపడేలా చేశాడు – అనుపమ ఎమోషనల్

నీచంగా ప్రవర్తించాడు.. పీరియడ్స్ విషయంలో సిగ్గుపడేలా చేశాడు – అనుపమ ఎమోషనల్
Advertisement

Anupama parameswaran:’ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) తొలిసారి నితిన్ (Nithin) హీరోగా , సమంత (Samantha ) హీరోయిన్గా , త్రివిక్రమ్(Trivikram ) దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది. అందం, అభినయంతో చారడేసి కళ్ళతో కుర్రకారు హృదయాలను దోచుకున్న అనుపమ శతమానం భవతి సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది .చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఇటీవల బైసన్, పరదా , కిష్కిందపురి అంటూ పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

టాక్సిక్ రిలేషన్ లో నరకం చూసాను…

ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే అనుపమ సడన్గా లవ్లో పడిందని, అతనితో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తాను తన బంధాన్ని తెంచుకుంటున్నానని, ఇప్పుడు ఫ్రీ బర్డ్ గా మారాను అంటూ బ్రేకప్ పై స్పందించింది. మూడు నాలుగు రోజులుగా వరుసగా తన బ్రేకప్ విషయంపై కామెంట్లు చేస్తున్న ఈమె.. ఇప్పుడు మరోసారి అతడు పెట్టిన టార్చర్ ను పీరియడ్స్ విషయంలో అతడు చూపించిన నరకాన్ని కూడా అభిమానులతో పంచుకొని ఎమోషనల్ అయింది.

పీరియడ్స్ విషయంలోనూ సిగ్గుపడేలా చేశాడు..

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. తన మాజీ ప్రియుడు పై చేస్తున్న ఆరోపణలు మరిన్ని బయటకు వచ్చాయి. నా మాజీ బాయ్ ఫ్రెండ్ నన్ను చాలా అత్యంత దారుణంగా హింసించాడు. ఒక టాక్సిక్ రిలేషన్ నేను కొనసాగించాను. అయితే ఆ ప్రేమ బంధంలో అతడు ఒకరోజు రెమోలా, మరొక రోజు అపరిచితుడిలా చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. ముఖ్యంగా ప్రతినెలా వచ్చే పీరియడ్స్ విషయంలో కూడా సిగ్గుపడేలా చేశాడు. నీకు పీరియడ్స్ టైం కదా? ఇంకా రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా అంటూ చాలా చులకనగా అడిగేవాడు. తన తప్పులను ప్రశ్నిస్తే చాలా దారుణంగా మాట్లాడేవాడు.

11 మంది పిల్లల్ని కనాలని కలలు కన్నాను..

ఒకప్పుడు నాకు ఏకంగా 11 మంది పిల్లలు కావాలని కలలు కనేదాన్ని. కానీ అతడి ప్రవర్తన చూశాక అసలు పిల్లలే వద్దు అనే పరిస్థితికి వచ్చాను. ముఖ్యంగా ఒక మహిళగా పుట్టినందుకే కదా నాకు ఇలాంటి మాటలు అంటూ అతడు చూపించిన నరకాన్ని మరొకసారి బయటపెట్టింది అనుపమ.

Advertisement

also read:అనిల్ రావిపూడిపై ఇంత కక్ష్య.. ఏకంగా రంగంలోకి రౌడీలు!

అసలు విషయం బయట పెట్టదా?

ఇకపోతే అనుపమ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఈ విషయాలు చెబుతోంది. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈమె బయట పెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా బైసన్ సినిమా సమయం నుంచే విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ తో ఈమె ప్రేమలో ఉందని, పెళ్ళికి కూడా సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు బ్రేకప్ అయిందని ప్రకటించడంతో ధృవ్ తో బ్రేకప్ చేసుకుందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ధృవ్ అనుపమను ఇంత దారుణంగా టార్చర్ చేశాడా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమ చేస్తున్న ఈ కామెంట్లు ధృవ్ ని ఉద్దేశించా లేక ఈమె బాయ్ ఫ్రెండ్ మరొకరు ఉన్నారా అనే విషయంపై స్పష్టత రావడం లేదు

Related News

ఎన్టీఆర్ ఇంట్లో విషాదం.. కన్నీటి పర్యంతమౌతూ ఎమోషనల్ పోస్ట్!

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఆయేషా ఖాన్..ఫొటోస్ వైరల్!

తారక్‌ కూడా అదే రూట్‌లోకి.. మరో కుంపటి రెడీ!

బాలయ్య NBK 112 ఆగిపోయిందా? కొరటాల నెక్స్ట్ ఏంటి?

షూటింగ్‌లో లేట్, సెట్‌లో ఫోన్.. అసలు విషయాలు కక్కేసిన సెలబ్రిటీలు

శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే

Big Stories

Advertisement
×