Anushka Shetty:అనుష్క శెట్టి (Anushka Shetty) .. ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె నాగార్జున (Nagarjuna ) తో ‘సూపర్’ సినిమా చేసి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే.. మరొకవైపు బికినీలు ధరించి గ్లామర్ తో కూడా కట్టిపడేసింది. అంతేకాదు ‘అరుంధతి’ లాంటి చిత్రాలతో ఫిమేల్ సెంట్రిక్ మూవీలు చేసి అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ‘బాహుబలి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
అలా ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు ఫిమేల్ సెంట్రిక్ మూవీ లతో సంచలనం సృష్టించిన అనుష్క.. బాహుబలి 2 తర్వాత నిశ్శబ్దం, భాగమతి, సైజ్ జీరో వంటి చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. చివరిగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) తో కలిసి ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇటీవల సెప్టెంబర్ 5న క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi) దర్శకత్వంలో మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఘాటి (Ghaati)తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు ప్రశంసలు లభించినా.. పెద్దగా ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా అభిమానులకు షాక్ కలిగించే అంశాన్ని తెలిపింది అనుష్క. అదే వాస్తవిక ప్రపంచం అంటూ చెప్పుకొచ్చింది. అయితే అనుష్కలో సడన్గా ఇలా మార్పు రావడానికి కారణం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క.. ఒక కీలక ప్రకటన తెలియజేసింది.” నేను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. స్క్రోలింగ్ ను పక్కనపెట్టి ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనందరి వాస్తవ ప్రపంచం అదే కదా.. అతి త్వరలోనే మీతో మరిన్ని మంచి స్టోరీలు పంచుకుంటాను. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను” అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం అనుష్క సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వబోతున్నానని చెప్పడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సినిమాలు చేయక ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోతే ఎలా అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
అనుష్క వ్యక్తిగత జీవితం..
అనుష్క వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, నాలుగు పదుల వయసు దాటినా సరే ఇంకా వివాహం అనే మాట ఎత్తడం లేదు ఈ ముద్దుగుమ్మ. గతం నుంచి ప్రభాస్ (Prabhas) తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇవి మాత్రం రూమర్స్ గానే మిగిలిపోయాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మధ్యలో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఒక బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా.. అది కేవలం రూమర్ గానే మిగిలిపోయింది. దీనికి తోడు ఇండస్ట్రీకి చెందిన మరో వ్యక్తితో అనుష్క పెళ్లి అంటూ కామెంట్లు చేశారు అయినా సరే అందులో కూడా నిజం లేకపోయింది.
ALSO READ:Bigg Boss 9: ఇలా తయారయ్యారేంట్రా సామీ.. మరీ ఇంత కక్కుర్తా ?
పెళ్లి పై స్పందించని అనుష్క..
అభిమానులు ఇంతటితో ఆగక ఏకంగా టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ కి, అనుష్కకు పెళ్లి చేశారు. అంతే కాదు వీళ్ళిద్దరికీ ఒక క్యూట్ పాప పుట్టినట్లుగా కూడా ఇమేజెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఎన్ని వచ్చినా అనుష్క మాత్రం పెళ్లి పై స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.