Bigg Boss 9:ప్రస్తుతం తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రారంభమైన ఈ సీజన్ అనూహ్యమైన ట్విస్టులతో అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. అటు సోషల్ మీడియా ద్వారా సినిమాల ద్వారా , యూట్యూబ్ ద్వారా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తొమ్మిది మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చారు.
మొదటి కెప్టెన్గా సంజన బాధ్యతలు..
కామనర్స్ సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలు మొదటి రోజు నుంచే తమ పర్ఫామెన్స్ మొదలుపెట్టారని చెప్పవచ్చు. రేటింగ్ పెంచడానికి తమను తాము తక్కువ చేసుకుంటూ ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ అయినా పర్లేదు అనే రేంజ్ లో ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సంజన నటనకైతే మాటల్లేవని చెప్పాలి. మొదట్లోనే షాంపూ, కండిషనర్ అంటూ ఎవరి మాట వినని లేడి మోనార్క్ గా పేరు దక్కించుకుంది. దీంతో హౌస్ లో అందరి వ్యతిరేకత అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ టాస్క్ లో సత్తా చాటి హౌస్ కి మొదటి వారం.. మొదటి కెప్టెన్ గా ఎన్నికయి అందరి దృష్టిని ఆకట్టుకుంది సంజన.
ALSO READ:Hansika Motwani: హన్సికకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ.. అసలేం జరిగిందంటే?
5వ ఎపిసోడ్ రెండవ ప్రోమో రిలీజ్..
నిజానికి సంజన ప్రవర్తన చూసి మొదటివారమే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఆట తీరు చూశాక ఇది కదా అసలైన ఆట అంటే అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది సంజన వల్లే షో మంచి టిఆర్పి అందుకుంటుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఐదవ ఎపిసోడ్ కు సంబంధించిన రెండవ ప్రోమోను విడుదల చేయగా.. ముక్కు సూటిగా ఉండే హరిత హరీష్ దొంగగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కూల్డ్రింక్ కోసం దొంగతనం చేయడం ఏంటి? ఇంత కక్కుర్తి.. ఇలా తయారయ్యారు ఏంట్రా మీరంతా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ముక్కుసూటి మనిషి అని పేరు తెచ్చుకొని ఇప్పుడు దొంగగా మారడంతో క్యారెక్టర్ లూజ్ అవుతున్నారు అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై వారాంతంలో నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.