BigTV English

Anushka Shetty : బాహుబలిని పక్కన పెట్టేసిన అనుష్క, ఘాటీ పరిస్థితి ఏంటి.?

Anushka Shetty : బాహుబలిని పక్కన పెట్టేసిన అనుష్క, ఘాటీ పరిస్థితి ఏంటి.?

Anushka Shetty : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఒక తరుణంలో అనుష్క చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించేవి. చాలామంది స్టార్ హీరోస్ తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనుష్కకు ఉంది. అంతేకాకుండా అరుంధతి సినిమాతో లేడీస్ సూపర్ స్టార్ గా కూడా మంచి పేరును సంపాదించుకుంది అనుష్క. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఎంతటి హిట్స్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.


ఇక ప్రస్తుతం అనుష్క తెలుగు సినిమాలకు కొద్దిగా దూరంగా ఉంది. మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత ఇప్పటివరకు అనుష్క నుంచి ఒక సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే సినిమాను చేస్తుంది అనుష్క. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఇదివరకే విడుదలైంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

బాహుబలిని పక్కన పెట్టేసింది 


అనుష్క కెరియర్ లో బాహుబలి చిత్రం ఒక మైలురాయి అని చెప్పాలి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని కూడా అమాంతం పెంచేసింది ఆ సినిమా. ఆ సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయిన కారణంగా చిత్ర యూనిట్ అంతా కూడా కలిసి రీ యూనియన్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి ప్రభాస్ కూడా హాజరయ్యాడు. కానీ అనుష్క హాజరు కాకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఘాటి చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది అని చెప్పాలి. ఆ సినిమా ప్రమోషన్స్ కు అనుష్క హాజరవుతుందా లేదా అనేది వాళ్లకు ఉన్న సందేహం.

లాస్ట్ ఫిలిం కూడా నవీన్ మోసాడు 

నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకి నవీన్ విపరీతంగా ప్రమోషన్ చేశాడు. అనుష్క హాజరు కాకపోయినా కూడా ఆ సినిమాకి మంచి బజ్ వచ్చేలా చేసాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క కెరీర్ కి కూడా మంచి ప్లస్ పాయింట్ గా మారింది. అయితే అనుష్క ప్రమోషన్స్ లో కనిపిస్తే చూడడానికి చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఘాటీ సినిమా విషయానికొస్తే తాను లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది సినిమా ప్రముఖులు. Uv క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Also Read : Fish Venkat: 2 పెళ్లిళ్లు చేసుకున్న ఫిష్ వెంకట్.. నిజాలు బయటపెట్టిన కూతురు!

Related News

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×