Indian Railways: దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, చాలా మంది ట్రైన్ జర్నీ కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. చాలా మంది అందుబాటులో ఉన్న బెర్తులను బుక్ చేసుకుంటారు. అయితే, ఇండియన్ ట్రైన్స్ లో అత్యంత సేఫ్ బెర్త్ ఏది? అనేది చాలా మందికి తెలియదు. సరైన బెర్త్ ను ఎంచుకోవడం వల్ల ప్రయాణాన్ని సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంద. ఇండియన్ రైల్వేస్ స్లీపర్ క్లాస్ (SL), AC 3-టైర్ (3A), AC 2-టైర్ (2A) కోచ్‌లలో వివిధ రకాల బెర్త్‌లను అందిస్తుంది. ప్రతి బెర్త్ భద్రత, యాక్సెసిబిలిటీ, ప్రైవసీని ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంతకీ, ఇండియన్ రైళ్లలో అత్యంత సురక్షితమైన బెర్త్ ఏది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ రైళ్లలో బెర్త్ రకాలు
⦿ దిగువ బెర్త్ (LB): ఇది రైలులో దిగువ స్థాయిలో ఉంటుంది. పగటిపూట కూర్చోవడానికి, రాత్రి నిద్రించడానికి ఉపయోగిస్తారు.
⦿ మిడిల్ బెర్త్ (MB): దిగువ, ఎగువ బెర్త్‌ల మధ్య ఉంటుంది. పగటిపూట ఈ బెర్త్ ను మూసేయాల్సి ఉంటుంది.
⦿ ఎగువ బెర్త్ (UB): పైభాగంలో ఈ బెర్త్ ఉంటుంది. నిచ్చెన ద్వారా యాక్సెస్ చేయబడుతుంది.
⦿ సైడ్ లోయర్ బెర్త్ (SLB): నడుమ, కిటికీ దగ్గర ఈ సీటు ఉంటుంది. దీన్ని బెర్త్ గా కూడా మార్చుకోవచ్చు.
⦿ సైడ్ అప్పర్ బెర్త్ (SUB): పక్క దిగువన కిటికీ వీక్షణను అందిస్తుంది. కానీ, పైనకు ఎక్కాల్సి ఉంటుంది.
సేఫ్ బెర్త్ అంటే ఏంటి?
రైళ్లలో ఉన్న బెర్త్ లలో ఏది సేఫ్ అనేది కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండాలి. ఎత్తు నుంచి పడటం లాంటి ప్రమాదాలను నివారించాలి. ప్రైవసీ, భద్రత కల్పించాలి. వాష్ రూమ్ లు, అత్యవసర ఎగ్జిట్ ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న బెర్త్ ను సేఫ్ బెర్త్ గా చెప్పుకోవచ్చు.
ఇండియన్ రైల్వేలో ఏ బెర్త్ అత్యంత సురక్షితమైనది?
భారతీయ రైల్వే లోయర్ బెర్త్ అనేది అత్యంత సురక్షితమైనది. AC 2-టైర్ లేదంటే 3-టైర్ కోచ్ లలో లోయర్ బెర్త్ చాలా మంది ప్రయాణికులకు సురక్షితమైన ఎంపిక. ఇది గ్రౌండ్ లెవల్ లో ఉంటుంది. పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, నడవలేక ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. రిజర్వ్ చేయబడిన కోటాలలో లోయర్ బెర్త్ లకు భారతీయ రైల్వే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ బెర్త్ మీది నుంచి కింద పడిపోయే ప్రమాదం లేదు. సీటు కింద సామాను నిల్వకు సులభమైన యాక్సెస్ ఉంటుంది. దొంగతనం ప్రమాదాలను తగ్గిస్తుంది. వాష్ రూమ్ లతో పాటు వెంటనే బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. బెడ్డింగ్, కంట్రోల్ వాతావరణంలో AC కోచ్ లలో సౌకర్యవంతంగా ఉంటుంది.
Read Also: IRCTC అకౌంట్ ను రైల్ వన్ తో లింక్ చేసుకోవాలా? సింపుల్ గా ఇలా చేయండి!