Fish Venkat:ప్రముఖ హాస్య నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఫిష్ వెంకట్ (Fish Venkat). ఎన్టీఆర్(NTR ) హీరోగా నటించిన ఆది సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం నేటికీ కొనసాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఆయన నటన అమోఘం అని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. రెండు కిడ్నీలు చెడిపోవడమే కాకుండా లివర్ కూడా చెడిపోయిందని.. ప్రస్తుతం కిడ్నీ రీ ప్లాంటేషన్ చేస్తే తప్ప ఆయన బ్రతికే ప్రసక్తే లేదు అని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో దాతలు ఎవరైనా ముందుకు రాకపోతారా అని ఆయన కూతురు, భార్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఫిష్ వెంకట్..
ఇలాంటి సమయంలో ఫిష్ వెంకట్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఫిష్ వెంకట్ రెండు వివాహాలు చేసుకున్నారని.. అందుకే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును రెండు కుటుంబాలకు సర్దడం లోనే సరిపోయిందని వార్తలు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇలా రెండు కుటుంబాలకు తగిలేసాడు కాబట్టే ఇప్పుడు డబ్బుల కోసం అందుకుంటున్నారు అంటూ అత్యంత దారుణంగా ఫిష్ వెంకట్ పై కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఆయన కూతురు వరకు వెళ్లడంతో తాజాగా బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన బాధను వెల్లడించారు.
ఫిష్ వెంకట్ రెండు పెళ్లిళ్లపై నిజాలు బయటపెట్టిన కూతురు..
ఫిష్ వెంకట్ కూతురు మాట్లాడుతూ.. “ఒకవైపు మా నాన్న ఆరోగ్యం గురించి మేము తపన పడుతుంటే.. ఇంకొక వైపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మమ్మల్ని మానసికంగా మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి” అంటూ ఆమె తెలిపారు. “మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. అసలు మా నాన్న రెండు వివాహాలు చేసుకున్నారు అనడానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది? ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె కూడా ఉండాలి కదా? మరి ఆమె ఎక్కడ..? రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు అనే వార్తలలో నిజం లేదు. కనీసం ఇప్పటికైనా మా కష్టాన్ని అర్థం చేసుకొని ఇలాంటి రూమర్స్ సృష్టించకండి” అంటూ ఆయన కూతురు వేడుకున్నారు. ఇక రెండు పెళ్లిళ్లు అంటూ వస్తున్న వార్తలపై ఫిష్ వెంకట్ కూతురు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు.
విషమంగా మారిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా చెడిపోవడం వల్ల ఆయన పరిస్థితి విషమంగా మారిందని, గత మూడు రోజులుగా కళ్ళు కూడా తెరవలేదని ఆమె తెలిపారు. వైద్యులు పరిస్థితి చాలా సీరియస్ అని, ఆయన ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. ఇక ఎలాగైనా సరే ఆయనను బ్రతికించాలని.. కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకుంటున్నారట. కనీసం ఇప్పటికైనా దాతలు ఎవరైనా స్పందించి.. ఫిష్ వెంకట్ కు ప్రాణ దానం చేయాలి అని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ALSO READ:Film Industry: పెప్పర్ స్ప్రే కొట్టి సీరియల్ నటిపై హత్యాయత్నం.. కట్టుకున్న భర్తే