BigTV English

Anushka Shetty: అనుష్క లేకుండానే ప్రమోషన్స్… పాపం నిర్మాతే స్వయంగా…

Anushka Shetty: అనుష్క లేకుండానే ప్రమోషన్స్… పాపం నిర్మాతే స్వయంగా…

Anushka Shetty: ప్రస్తుతం అనుష్క సినిమాలు చేయటం తగ్గించారు కానీ ఒకప్పుడు వరుసగా అనుష్క సినిమాలు వచ్చేవి. దాదాపు అంతమంది స్టార్ హీరోలతో కూడా అనుష్క పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో కూడా పనిచేసింది. ఇప్పుడు అందరూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు కానీ అప్పట్లోనే అనుష్క కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది.


 

అనుష్క అంటే అందరికీ పక్కన గుర్తొచ్చే సినిమా అరుంధతి. ఆ సినిమాలో అనుష్క చేసిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన సక్సెస్ సాధించింది. అలానే బాహుబలి సినిమాతో కూడా అనుష్కకి మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం అనుష్క ఘాటీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టింది.


ప్రమోషన్స్ కి దూరం 

ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కి అనుష్క హాజరు కావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుష్క హాజరు కాకపోవచ్చు. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే ప్రమోషన్స్ కి హాజరు కాలేను అని క్లారిటీగా చెప్పేసిందిట అనుష్క. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అనుష్క చేసిన మిస్సట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విషయంలో కూడా ఇదే శైలిని చూపించారు. నవీన్ పోలిశెట్టి ఒక్కడే సినిమా మొత్తాన్ని భుజంపై వేసుకొని విపరీతంగా ప్రమోట్ చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి సినిమా విడుదల కాలేదు. ఇక ఘాటీ సినిమాకి సంబంధించి, కంటెంట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అనుష్క అరాచకం చూపించారు అని చెప్పాలి.

క్రిష్ కం బ్యాక్ అవుతుందా?

గమ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ జాగర్లమూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక విభిన్నమైన దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు ఈ సినిమాతో. ఆ తర్వాత చేసిన వేదం సినిమా కూడా మంచి హిట్ అయింది. వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపిస్తుంది. అనుష్క వేదం సినిమాలో ఈ పాత్రలో కనిపిస్తుంది అన్నప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది అప్పట్లో. ఆ తర్వాత క్రిష్ చేసిన సినిమా కృష్ణం వందే జగద్గురు. కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వరకు క్రిష్ కు విపరీతమైన పేరు ఉండేది. ఎన్టీఆర్ బయోపిక్ తీసిన తర్వాత క్రిష్ వరుస వివాదాలు ఎదుర్కొన్నాడు. మణికర్ణిక సినిమా నుంచి తప్పుకోవడం, హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడం. ఇలాంటివి చాలా జరిగాయి ఇప్పుడు ఈ సినిమాతో క్రిష్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడేమో వేచి చూడాలి.

Also Read : Pawan Kalyan OG : అన్ని థియేటర్స్ ను ఓజి కు అంకితం చేశారు. మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?

Related News

Hrithik Roshan:  గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంటిని అద్దెకిచ్చిన హృతిక్.. రెంట్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Ramgopal Varma: పైరసీలో సినిమా చూస్తానాన్న వర్మ.. మన బ్యాచే అంటున్న నెటిజన్స్!

Kichcha Sudeep : దయచేసి ఎవరూ రావద్దు.. అభిమానులను వేడుకున్న సుదీప్.. ఏమైందంటే?

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Sachin Tendulkar: సౌత్ సినిమాపై మనసు పడ్డ క్రికెట్ దిగ్గజం… అంతగా నచ్చిన సినిమా ఏంటబ్బా?

Big Stories

×